Asianet News TeluguAsianet News Telugu

విశాఖలో మైనర్ బాలికకు ప్రేమ పేరుతో జనసేన నేత బెదిరింపులు: పోలీసులకు బాధితురాలి ఫిర్యాదు

విశాఖపట్టణంలో మైనర్ బాలికను  జనసేన నేత రాఘవరావు  ప్రేమ పేరుతో వేధింపులకు గురి చేసినట్టుగా  పోలీసులకు బాధితురాలు  ఫిర్యాదు చేసింది. 

Minor Girl Complaints against Janasena leader Raghavarao to Police in Visakhapatnam
Author
First Published Dec 29, 2022, 2:19 PM IST

విశాఖపట్టణం: విశాఖపట్టణం జిల్లాలో  మైనర్ బాలికను జనసేన నేత రాఘవరావు వేధించారు.  ఈ విషయమై బాధితురాలు పోలీసులకు  పిర్యాదు చేసింది.  ప్రేమిస్తున్నానని  మైనర్ బాలిక ఉంటున్న ఫ్లాట్ కు  రాఘవరావు వచ్చి  వేధింపులకు గురి చేసినట్టుగా  పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రాఘవరావు  కత్తి  తీసుకొని  వచ్చినట్టుగా  కూడా బాధితులు  పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రేమించకపోతే చంపేస్తానని బెదిరించినట్టుగా  బాధితురాలు  పోలీసులకు ఫిర్యాదు చేసిందని  ప్రముఖ తెలుగు న్యూస్ చానెల్ ఎన్టీవీ కథనం ప్రసారం చేసింది. 

కొంత కాలంగా  మైనర్ బాలికను రాఘవరావు వేధింపులకు గురి చేస్తున్నట్టుగా  మహిళా సంఘాలు  ఆరోపిస్తున్నారు.  ఈ విషయమై రాఘవరావుపై  చర్యలు తీసుకోవాలని  కోరుతూ  విశాఖపట్టణం త్రీ టౌన్ పోలీస్  స్టేషన్  ఎదుట  మహిళా సంఘాలు  ఆందోళనకు  దిగారు.రాఘవరావు , బాధితురాలు ఒకే అపార్ట్ మెంట్  కు చెందినవారని  పోలీసులు  చెబుతున్నారు.  రాఘవరావు  బాధితురాలిని  బెరిరించేందుకు  వచ్చిన సమయంలో మద్యం మత్తులో  ఉన్నట్టుగా  పోలీసులు  చెప్పారు. బాధితురాలి ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడిని  పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.


 

Follow Us:
Download App:
  • android
  • ios