Asianet News TeluguAsianet News Telugu

మైనర్ల డ్రైవింగ్.. పట్టబడితే అంతే.. తల్లిదండ్రులకూ జైలు..

కొందరు మైనర్లు బైక్ ల కోసం తల్లిదండ్రులను బెదిరిస్తున్నారని.. క్రెడిట్ కార్డుల ద్వారా కొనాలంటూ బలవంత పెడుతున్నారని ట్రాఫిక్ పోలీస్ అధికారుల సర్వేలో తేలింది. బైక్ లైసెన్స్ లేకుండా రేసుల్లో పాల్గొంటున్నారని పోలీసులు గుర్తించారు. అలాంటివారు తొలిసారి ట్రాఫిక్ పోలీసులకు పట్టుబడితే.. మైనర్లతో పాటు వారి తల్లిదండ్రులనూ జైలుకు పంపుతామంటూ హెచ్చరిస్తున్నారు.

Minor driving can send parents to jail in hyderabad
Author
Hyderabad, First Published Jan 18, 2022, 6:57 AM IST

హైదరాబాద్ :  ఇటీవలి కాలంలో.. హైదరాబాద్ లో ప్రమాదాలు బాగా పెరిగిపోయాయి. దీనికి తోడు కొద్దిరోజుల నుంచి Students, minors.. బైకులు, కార్లు నడుపుతూ వరుసగా ప్రమాదాల బారిన పడుతున్నారు. ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించిన పోలీసులు వారికి వాహనాలు ఎవరు ఇస్తున్నారు? వాహనాలు నడపడంలో అనుభవం ఉందా? రాత్రివేళల్లో Bikes, cars నడిపేటప్పుడు మద్యం తాగుతున్నారా? అన్న అంశాలపై ట్రాఫిక్ పోలీసులు అధ్యయనం చేస్తున్నారు. 

తల్లిదండ్రులు, ప్రైవేట్ సంస్థలు, మొబైల్ యాప్ ద్వారా బైకులు, కార్లు కిరాయికి ఇచ్చే కంపెనీల నుంచి వాహనాలు వస్తున్నాయని వీరి అధ్యయనంలో గుర్తించారు. ఇలా Minor driving మీద ఈ ఏడాది ఇప్పటివరకు 4385 కేసులు నమోదు చేశారు.

30 శాతం మంది వారే..
బైకులు కారు నడుపుతున్న యువకులు, మైనర్లు (ఇంటర్మీడియట్ విద్యార్థులు) కొంత మంది తల్లిదండ్రులతో పోట్లాటలకు దిగి ద్విచక్ర వాహనాలను కొనాలంటూ ఒత్తిడి తెస్తున్నారు.  కళాశాలలకు  బస్సుల్లో వెళ్తున్నామని  స్నేహితులు  అందరూ బైక్ ల మీద వస్తున్నారని పరువు పోతుంది. అంటూ తల్లిదండ్రులకు చెబుతున్నారు. 

కొందరు మైనర్లు బైక్ ల కోసం తల్లిదండ్రులను బెదిరిస్తున్నారని.. క్రెడిట్ కార్డుల ద్వారా కొనాలంటూ బలవంత పెడుతున్నారని ట్రాఫిక్ పోలీస్ అధికారుల సర్వేలో తేలింది. బైక్ లైసెన్స్ లేకుండా రేసుల్లో పాల్గొంటున్నారని పోలీసులు గుర్తించారు. అలాంటివారు తొలిసారి ట్రాఫిక్ పోలీసులకు పట్టుబడితే.. మైనర్లతో పాటు వారి తల్లిదండ్రులనూ జైలుకు పంపుతామంటూ హెచ్చరిస్తున్నారు.

ఇదిలా ఉండగా, హైద‌రాబాదులోని రాజేంద్రన‌గ‌ర్  ఓఆర్ఆర్ పై (orr)  జనవరి 11న రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. shamshabad ప్రాంతం నుంచి హైద‌రాబాద్ లోని gacchibowli వైపు వెళ్తుండ‌గా ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. అతి వేగం ఈ ప్ర‌మాదానికి ప్ర‌ధాన కార‌ణ‌మ‌ని పోలీసులు తెలుపుతున్నారు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన పూర్తి వివ‌రాలు ఇంకా తెలియాల్సి ఉంది. 

అతివేగంగా, నిర్ల‌క్ష‌మైన డ్రైవింగ్ వ‌ల్ల ఓఆర్ఆర్ ల‌పై త‌ర‌చూ ప్ర‌మాదాలు జ‌రుగుతున్నాయి. గ‌తేదాది నవంబ‌ర్ 22వ తేదీన అబ్దుల్లాపూర్ మెట్టు పోలీస్ స్టేషన్ పరిధి కోహెడ వద్ద ఔటర్ రింగు రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముందుగా వెళుతున్న గుర్తు తెలియని వాహనాన్ని కారు ఢీకొట్ట‌డంతో ఈ ప్ర‌మాదం చోటు చేకుంది. ఇందులో ఇద్ద‌రు త‌ల్లీ కూతుర్లు మృతి చెందారు. మ‌రో ముగ్గురు గాయాల‌ప‌ల‌య్యారు. 

అలాగే గ‌తేడాది అక్టోబ‌ర్ 8న రంగారెడ్డి జిల్లా నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓఆర్ఆర్ పై ఘోర రోడ్డు ప్రమాదం జ‌రిగింది. రెండు కార్లు మితిమీరిన వేగంతో ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. కార్లలో ఉన్న ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి.  శంషాబాద్ నుంచి గచ్చిబౌలికి వెళ్తుండగా నార్సింగి సర్కింల్ వద్ద రెండు కార్లు అతివేగంగా వచ్చి ఒకదానికొకటి ఢీ కొట్టాయి. దీంతో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్ర‌మాదంలో గాయాల‌పాలైన వారిని వెంట‌నే హాస్పిట‌ల్ కు తీసుకెళ్లారు.  కారు నడుపుతున్న ఇద్దరు వ్యక్తులు ప్రమాదంలో అక్కడిక్కడే మృతి చెందారు. 

Follow Us:
Download App:
  • android
  • ios