యాదవ్ మరణానికి ఖచ్చితమైన కారణం ఇంకా తెలియలేదు, కానీ, ఇటీవలి సంఘటనల నేపథ్యంలో గుండె ఆగిపోవడం అతని మరణానికి కారణమని భావిస్తున్నారు.

హైదరాబాద్‌ : మంగళవారం హైదరాబాద్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ ఇండోర్ స్టేడియంలో బ్యాడ్మింటన్ ఆడుతూ 38 ఏళ్ల వ్యక్తి కుప్పకూలి మృతి చెందాడు. గత రెండు వారాల్లో తెలంగాణలో ఇలాంటి ఘటన జరగడం ఇది ఐదవది. ఆ వ్యక్తిని హైదరాబాద్‌లోని మల్కాజిగిరి శివారు ప్రాంతానికి చెందిన శ్యామ్ యాదవ్‌గా గుర్తించారు, ఈ సంఘటన స్టేడియంలోని సీసీ కెమెరాలో బంధించబడింది. యాదవ్ బ్యాడ్మింటన్ కోర్ట్‌లో నేలపై పడిపోవడం, అతనికి ఊపిరి ఆడుతుందా లేదా అని చాలా మంది వ్యక్తులు అతడిని పరీక్షించడం వీడియోలో కనిపిస్తుంది.

వెంటనే సీపీఆర్ చేస్తే అతను బతికేవాడని ఈ వీడియో చూసిన కొంలు అభిప్రాయపడుతున్నారు. యాదవ్ సోదరుడు మాట్లాడుతూ 
యాదవ్ బ్యాడ్మింటన్, క్రికెట్, ఇతర క్రీడలలో చురుకుగా పాల్గొనే ఉత్సాహభరితమైన క్రీడాకారుడు అని చెప్పాడు. ఓ ప్రయివేటు కంపెనీలో పనిచేస్తున్నాడని, పని వేళ్లలు అయిపోయాక ప్రతీ రోజూ ఆడుకునేవాడని తెలిపాడు.

అయితే, యాదవ్ మరణానికి ఖచ్చితమైన కారణం ఇంకా తెలియనప్పటికీ, ఇటీవలి వరుస సంఘటనల ఆధారంగా, గుండె ఆగిపోవడం అతని ఆకస్మిక మరణానికి కారణమని భావిస్తున్నారు.ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులు కుప్పకూలి మరణించిన ఇలాంటి సంఘటనలను దేశ వ్యాప్తంగా చాలా వెలుగులోకి వస్తున్నాయి.

తెలంగాణలో గత పదిహేను రోజుల్లో ఇలాంటి ఘటన జరగడం ఇది ఐదోసారి. ఇంతకు ముందు తెలంగాణలో బంధువు పెళ్లి వేడుకలో డ్యాన్స్ చేస్తూ 19 ఏళ్ల యువకుడు కుప్పకూలి మృతి చెందాడు. హైదరాబాద్‌కు 200 కిలోమీటర్ల దూరంలోని నిర్మల్ జిల్లా పార్డి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

శ్రీ చైతన్య కాలే‌జ్‌‌లో సాత్విక్ ఆత్మహత్య ఘటనపై ఇంటర్ బోర్డు విచారణ.. యాజమాన్యానికి నోటీసులు..!

ఫిబ్రవరి 20న హైదరాబాద్‌లో జరిగిన హల్దీ వేడుకల్లో పాల్గొన్న ఓ వ్యక్తి ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలో, వరుడి పాదాలకు పసుపు రాసేందుకు ముందుకు వంగిన వ్యక్తి నేలపై కుప్పకూలిపోయాడు. ఆయనకు గుండెపోటు వచ్చినట్లు భావిస్తున్నారు.

ఫిబ్రవరి 23న, హైదరాబాద్‌లోని జిమ్‌లో వర్కౌట్ చేస్తున్న 24 ఏళ్ల పోలీసు కానిస్టేబుల్ గుండెపోటుతో మరణించాడు. హైదరాబాద్‌లో బస్సు కోసం వేచి చూస్తున్న ఓ వ్యక్తి ఫిబ్రవరి 24న అకస్మాత్తుగా రోడ్డుపై కుప్పకూలిపోయాడు. అయితే, అతడిని అక్కడే డ్యూటీలో ఉన్న ట్రాఫిక్ పోలీసు అతనికి సీపీఆర్ ఇవ్వడం ద్వారా అతని ప్రాణాలను కాపాడాడు.

సీపీఆర్‌పై ప్రజలకు శిక్షణ ఇస్తున్న జనరల్ ఫిజీషియన్ డాక్టర్ ఆశిష్ చౌహాన్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సీపీఆర్ నేర్చుకుని ప్రాణదాతగా మారాలన్నారు. సీపీఆర్‌ అనేది గుండె అకస్మాత్తుగా విఫలమైనప్పుడు పునరుద్ధరించడానికి నిమిషానికి 100 సార్లు ఛాతీపై నొక్కడం.

పాఠశాల, కళాశాల విద్యార్థులు, సాఫ్ట్‌వేర్‌ నిపుణులు, డ్రైవర్లు- అందరూ తప్పనిసరిగా సీపీఆర్‌లో శిక్షణ పొందాలని అపోలో హాస్పిటల్స్‌ డాక్టర్‌ పద్మాకర్‌ అన్నారు. హృద్రోగ నిపుణుడు డాక్టర్ శివ కుమార్ మాట్లాడుతూ, సీపీఆర్‌ తో పాటు, ముఖ్యంగా హఠాత్తుగా కూలిపోవడం లాంటి వాటిని సాంకేతికంగా అరిథ్మియా లేదా క్రమరహిత విద్యుత్ ప్రేరణలు, డీఫిబ్రిలేటర్ ద్వారా షాక్ అని పిలుస్తారు. "అన్ని అభివృద్ధి చెందిన దేశాలలో, విమానాశ్రయాలు, మాల్స్, రైల్వే స్టేషన్లు, జిమ్‌లు మొదలైన వ్యూహాత్మక ప్రదేశాలలో అమర్చబడి ఉంటాయి, ఇక్కడ శిక్షణ పొందిన వ్యక్తి సేవను అందించి.. ప్రాణాలను కాపాడవచ్చు"