తెలంగాణ రాష్ట్ర మంత్రులు జూపల్లి కృష్ణారావు, పట్నం మహేందర్ రెడ్డి లకు వ్యతిరేకంగా కొడంగల్ లో నిరసన తెలిపారు కాంగ్రెస్ కార్యకర్తలు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన మంత్రులకు వ్యతిరేకంగా రేవంత్ అనుచరులు నినాదాలు చేశారు. మంత్రులకు చిరాకు తెప్పించారు. దోపిడి రాజ్యం.. దొంగల రాజ్యం అంటూ మంత్రుల ముందే నినదించారు. మద్దూరు మండలంలో శిలాఫలకం కూలిన ఘటన వివాదం రేపింది. దాంతోపాటు మంత్రులకు వ్యతిరేకంగా నినాదాలు చేయడం కూడా ఉద్రిక్తతకు కారణమైంది. మరోవైపు శిలాఫలకం కూలగొట్టిన ఘటనలో రేవంత్ పై స్థానిక నందిగామ గ్రామ నేతలు ఫైర్ అయ్యారు. రేవంత్ కు వ్యతిరేకంగా టిఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. రేవంత్ వాహనాలను అడ్డగించడంతో రేవంత్ బైక్ మీద కొడంగల్ వెళ్లిపోయారు. మంత్రులకు నిరసన సెగ వీడియో కింద చూడండి.