సచివాలయం నుంచి తలసాని వీడియో కాన్ఫరెన్స్ (వీడియో)

minister talasani video conference from secretariat
Highlights

సెక్రటేరియట్ న్యూస్..

పశుసంవర్ధక శాఖ అధికారులతో సచివాలయం నుండి సంబంధిత శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

పశు వైద్య శాలల భవనాల నిర్మాణం, మరమ్మతులు, అవసరమైన పరికరాల గురించి సమీక్ష నిర్వహించారు మంత్రి తలసాని.

ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పశుసంవర్ధక శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, డైరెక్టర్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

వేసవిలో పశువుల సంరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మంత్రి తలసాని జిల్లాల పశు సంవర్థక శాఖ అధికారులతో చర్చించారు.

ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ ఏమన్నారంటే ...

గతంలో ఎన్నడూ లేని విధంగా పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసార్ ప్రత్యేక ఆలోచనతో  అనేక అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. పశు వైద్య శాలల భవనాలకు  అవసరమైన మరమ్మత్తులు, పరికరాల కోసం 10 రోజులలో ప్రతిపాదనలు పంపించండి. నిధులకు కొరత లేదు. ఆర్ఐడిఎఫ్ కింద చేపట్టిన పనులు పెండింగ్ ఉంటే ప్రతిపాదనలు పంపిస్తే వెంటనే నిధులు మంజూరు చేయడం జరుగుతుంది. నూతన జిల్లా కేంద్రాలలో  మందులు, దాణా నిల్వ చేసేందుకు గోదాముల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపించాలి.

నూతన పశువైద్యశాలల భవనాల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపిస్తే ప్రాధాన్యత క్రమంలో నిధులు పంపించడం జరుగుతుంది. ఇప్పటికే 5 వేల కోట్ల రూపాయల ఖర్చుతో గొర్రెల పంపిణీ కార్యక్రమం విజయవంతం గా కొనసాగుతుంది. వేసవిలో దాణా కొరత లేకుండా ముందస్తు చర్యలు తీసుకున్న కారణంగా ఎక్కడ దాణా ఇబ్బందులు ఏర్పడలేదు. జీవాల వద్దకే  వైద్యం తీసుకెళ్లాలి అనే ఉద్దేశ్యంతో  100 సంచార పశు వైద్యశాలలను ప్రారంభించి సేవలు అందించడం జరుగుతుంది. ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు సక్రమంగా అమలు జరిగేలా అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాల్సిన అవసరం ఉంది. సంచార పశు వైద్య శాలల సేవలు సక్రమంగా అందుతున్నాయా, మందుల కొరత ఉందా అనే విషయాలపై  ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి.

 

కింద వీడియో ఉంది చూడండి.

"

loader