Asianet News TeluguAsianet News Telugu

కీలక పరిణామం.. సీఎం కేసీఆర్‌ను క‌లిసిన కాంగ్రెస్ సీనియర్ మాజీ మంత్రి

సీఎం కేసీఆర్‌ను మాజీ మంత్రి పొన్నాల ల‌క్ష్మ‌య్య ఆదివారం నాడు మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. పొన్నాల ల‌క్ష్మ‌య్య దంపతుల‌ను సీఎం కేసీఆర్ సాద‌రంగా ఆహ్వానించారు. 

Minister Ponnala Lakshmaiah Meets Cm Kcr At Pragathi Bhavan KRJ
Author
First Published Oct 16, 2023, 12:38 AM IST | Last Updated Oct 16, 2023, 12:38 AM IST

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నగారా మోగడంతో అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల సమరానికి సంసిద్దమవుతున్నాయి. వ్యూహాప్రతి వ్యూహాలతో ప్రజాక్షేత్రంలోకి వెళ్తున్నాయి. ఇప్పటికే అధికార బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటన, మేనిఫేస్టో విడుదలతో దూకుడు మీద ఉండగా.. తాజాగా ఎన్నిక ప్రచార పర్వానికి కూడా శ్రీకారం చుట్టుంది. ఈ తరుణంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.   

మాజీ మంత్రి, తెలంగాణ సీనియర్ రాజకీయ నేత పొన్నాల లక్ష్మయ్య ఆదివారం నాడు ప్రగతి భవన్ లో బిఆర్ఎస్ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తో మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. పొన్నాల దంపతులను సాదరంగా ఆహ్వానించిన సిఎం కేసీఆర్ వారితో కాసేపు ముచ్చటించారు. వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రాజ్యసభలో బిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత, ఎం పీ కేశవరావు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, పార్టీ సీనియర్ నేత డా. దోసోజు శ్రవణ్  తదితరులున్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios