అయూబ్ మృతి తట్టుకోలేక చలించిపోయిన మంత్రి మహేందర్ రెడ్డి

గ్యాస్ నూనె పోసుకుని అంటించుకున్న తాండూర్ టిఆర్ఎస్ లీడర్ అయూబ్ ఖాన్ మూడు వారాల పాటు ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడి తేదకు శుక్రవారం తెల్లవారుజామున కన్నుమూసిండు. అయూబ్ ఆత్మహత్యా ప్రయత్నం తన కండ్ల ముందే జరగడంతో తాండూరు ఎమ్మెల్యే, రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి చలించి పోయిర్రు.

ఆగస్టు 30వ తేదీన తాను పాల్గొన్న సమావేశంలో తన ఎదుటే అయూబ్ కాల్చుకున్న నేపథ్యంలో మంత్రి పట్నం మహేందర్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నరు. శనివారం తన జన్మదిన వేడుకలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నరు. తాను వేడుకలకు దూరంగా ఉండడమే కాదు పార్టీ కార్యకర్తలెవరూ జన్మదిన వేడుకలు జరపరాదని ఆదేశాలు జారీ చేసిర్రు. చివరకు ఫ్లెక్సీలు కూడా ఎవరూ ఏర్పాటు చేయరాదని తన అభిమానులు, కార్యకర్తలకు సూచించిర్రు.

దీంతోపాటు అయూబ్ కుటుంబానికి తన వ్యక్తిగతంగా 20లక్షల రూపాయయల ఆర్థిక సాయం, టిఆర్ఎస్ పార్టీ తరుపున 10 లక్షలు ఇస్తానని, అయూబ్ కుటుంబానికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పిస్తానని కూడా హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.