తెలంగాణలో కరోనా వైరస్ బారినపడుతున్న రాజకీయ నాయకుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. తాజాగా టీఆర్ఎస్ నేత, మంత్రి మల్లారెడ్డికి కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో ఆయన సెల్ఫ్‌ ఐసోలేషన్‌లోకి వెళ్లిపోయారు. కాగా శనివారం నగర్ కర్నూల్ మాజీ ఎంపీ, సీనియర్ కాంగ్రెస్ నేత నంది ఎల్లయ్య కరోనా సోకి మరణించాడు.

ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మరణించాడు. అనారోగ్యంతో బాధ పడుతూ 10 రోజుల కింద నిమ్స్ లో చేరగా....  పరీక్షల అనంతరం వైద్యులు ఆయనకు కరోనో పాజిటివ్ వచ్చిందని నిర్ధారించారు. 10 రోజుల పాటు చికిత్స అనంతరం ఆయన నిమ్స్ లోనే మరణించిన సంగతి తెలిసిందే.