గతేడాది తన ఇల్లు, కార్యాలయాలు, కాలేజీలపై ఐటీ దాడులు జరగడంపై తెలంగాణ మంత్రి మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు దొంగలను వదిలేసి, తనపై ఐటీ దాడులు చేస్తున్నారని ఆయన ఫైర్ అయ్యారు.
తెలంగాణ మంత్రి మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు దొంగలను వదిలేసి , తమపై ఐటీ దాడులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలకు విద్యాదానం చేస్తున్న తనపై ఐటీ దాడి చేశారని మంత్రి ఫైర్ అయ్యారు. వివేక్ మీద.. ఈటల రాజేందర్ మీద ఐటీ దాడులు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. చాయ్ అమ్మినట్లు పబ్లిక్ ప్రాపర్టీని అమ్ముతున్నారని మల్లారెడ్డి మండిపడ్డారు. ఇప్పుడు సింగరేణిని కూడా అమ్ముతానంటున్నారని మంత్రి దుయ్యబట్టారు. కాగా.. గతేడాది నవంబర్ 22, 23 తేదీల్లో మంత్రి మల్లారెడ్డితో పాటు ఆయన బంధువులు, కుటుంబసభ్యుల ఇళ్లలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే.
Also REad: ఐటీ విచారణకు రెండో సారి మంత్రి మల్లారెడ్డి కొడుకు భద్రారెడ్డి: కాలేజీల ఆర్ధిక వ్యవహారాలపై ఆరా
ఇదిలావుండగా.. కొద్దినెలల క్రితం బండి సంజయ్‌కి సవాల్ విసిరారు మంత్రి మల్లారెడ్డి. తెలంగాణలో జరిగిన అభివృద్ధి ఏ రాష్ట్రంలోనూ జరగలేదన్న ఆయన.. మరో రాష్ట్రంలో తెలంగాణ తరహా అభివృద్ధి పథకాలను చూపిస్తే తాను మంత్రి, ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ విసిరారు. బండి సంజయ్ తనని ఎక్కడికి రమ్మంటే అక్కడి వస్తానని మల్లారెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రం రాకముందు రైతులకు న్యాయం జరగలేదని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పడ్డాక కేసీఆర్ రైతును రాజును చేశారని మల్లారెడ్డి ప్రశంసించారు. బ్యాంకులకు కోట్లాది రూపాయలు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన వారిని వదిలిపెట్టి.. రైతుల కోసం ఖర్చు చేసిన పైసల్ని ఇవ్వమంటున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
