భూకబ్జా ఆరోపణలపై స్పందించారు మంత్రి మల్లారెడ్డి. ఆ భూములు తాను కబ్జా చేయలేదని.. అసలు శ్యామల ఎవరో తనకు తెలియదని ఆయన తేల్చి చెప్పారు. ఆమెను స్థలం అమ్మాలని కూడా తాను అడగలేదని, బెదిరింపులకు పాల్పడలేదని మల్లారెడ్డి పేర్కొన్నారు.

ఈ విషయంలో ఎలాంటి విచారణకైనా సిద్ధమని మల్లారెడ్డి స్పష్టం చేశారు. అసలు ఆ భూమి తమకు అవసరం లేదని.. ఇష్టపూర్వకంగా అమ్మితే కొంటామని, లేదంటే లేదని చెప్పారు.

భూమికి సంబంధించిన పుస్తకం, డాక్యుమెంట్లు తీసుకుని వస్తే శ్యామలకు న్యాయం చేస్తానని.. ఒక్క కుంట కూడా పోనివ్వనని మల్లారెడ్డి హామీ ఇచ్చారు. ఆమెపై టీఆర్ఎస్ నేతలు ఒత్తిడి తీసుకొచ్చారని అంటున్నారని కానీ ఎవరు బెదిరించారో తనకు తెలియదని మంత్రి స్పష్టం చేశారు.

Alsp Read:భూకబ్జా ఆరోపణలు: మంత్రి మల్లారెడ్డిపై కేసు

కాగా, మల్లారెడ్డిపై మేడ్చల్ జిల్లాలోని దుండిగల్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. కుత్బుల్లాపూర్‌ మండలం సూరారంలో తన భూమిని కబ్జా చేయించారని శ్యామలదేవి అనే మహిళ మల్లారెడ్డిపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

మంత్రి అనుచరులు తన స్థలంలో ప్రహరీగోడ నిర్మించారని, తన లాయర్‌ కూడా మంత్రితో కుమ్మక్కయ్యారని ఆరోపించారు. వారు తప్పుడు అగ్రిమెంట్‌ను సృష్టించాడని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.