తెలంగాణ మంత్రి మల్లారెడ్డిపై భూ కబ్జా కేసు నమోదైంది. తన భూమిలో మల్లారెడ్డి అక్రమ నిర్మాణాలు చేపట్టారంటూ.. కుత్బుల్లాపూర్‌ మండలం సూరారంకు చెందిన శ్యామలదేవి అనే మహిళ మల్లారెడ్డిపై మేడ్చల్ జిల్లాలోని దుండిగల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

మల్లారెడ్డి చెరలో ఉన్న భూమిని విడిపించాలంటూ ఓ న్యాయవాదిని సంప్రదిస్తే.. ఆయనతోనే మంత్రి మల్లారెడ్డి కుమ్మక్కై తప్పుడు పత్రాలు సృష్టించారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. శ్యామలదేవి ఫిర్యాదు మేరకు దుండిగల్‌ పోలీసులు మంత్రి మల్లారెడ్డిపై కేసు నమోదు చేశారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.