జూబ్లీహిల్స్ సామూహిక అత్యాచార ఘటన తీవ్ర సంచలనం రేపుతోంది. ఈ కేసుకు సంబంధించి పోలీసుల తీరుపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే స్పందించిన హోం మంత్రి మహమూద్ స్పందించారు.
జూబ్లీహిల్స్ సామూహిక అత్యాచార ఘటన తీవ్ర సంచలనం రేపుతోంది. ఈ కేసుకు సంబంధించి పోలీసుల తీరుపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే స్పందించిన హోం మంత్రి మహమూద్ స్పందించారు. హైదరాబాద్ హజ్ హౌస్‌లో ఏర్పాటుచేసిన హజ్ యాత్రికుల వాక్సినేషన్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..అత్యాచార ఘటన బాధాకరమని హోంమంత్రి పేర్కొన్నారు. నిందితులు ఎవరైనా వదిలిపెట్టే ప్రసక్తి లేదన్నారు. ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు జరుగుతోందని, ఈ ఘటనలో పోలీసులపై వత్తిడి ఉందన్న ఆరోపణలను ఆయన కొట్టిపారేశారు. వారిపై ఎలాంటి వత్తిడి లేదన్న ఆయన...మైనర్ కావడంతో పోలీసులు వారి పరిధిలో విచారణ జరుపుతున్నారని వెల్లడించారు.
ప్రతిపక్ష పార్టీల ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదన్నారు. మైనర్లు కావడంతోనే చర్యలకు ఆలస్యం అవుతుందని చెప్పారు. నిందితులు మైనర్లు కావడంతో పోలీసులు వారి పరిధిలో విచారణ జరుపుతున్నారని వెల్లడించారు. పోలీసులు చాలా బాగా పనిచేస్తున్నారని చెప్పారు. తనపై వస్తోన్న ఆరోపణలు అబద్ధాలు అని చెప్పారు.
ఇక, హైదరాబాద్‌లోని అమ్నేషియా పబ్ నుంచి బాలికను కారులో తీసుకెళ్లి సామూహిక అత్యాచారం జరిపిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఈ ఘటనలో ప్రముఖుల పేర్లు ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ప్రతిపక్షాలు ఆందోళనలు, నిరసనలు చేపడుతున్నాయి.
మరోవైపు ఈ ఘటనలో తనపై ఆరోపణలు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో హోంమంత్రి మొహమూద్ అలీ మనవడు పుర్ఖాన్ శుక్రవారం స్పందించారు. అత్యాచార ఘటనతో తనకు సంబంధం లేదని.. ఘటన జరిగిన రోజున తాను మినిస్టర్స్ క్వార్టర్స్‌లో వున్నానని పుర్ఖాన్ తెలిపారు. తాను ఎవ్వరికీ పార్టీ ఇవ్వలేదని.. వాళ్లు ఎవరో కూడా తనకు తెలియదని ఆయన స్పష్టం చేశారు. ఆరోపణలు చేసిన వారు నిజానిజాలు తెలుసుకోవాలంటూ పుర్ఖాన్ అన్నారు.
