ఈసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకోవాలని టిఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చిందని తెలిపారు. ఈ మేరకు పార్టీ శాసన సభ్యులు, జిల్లా అధ్యక్షులతో మంత్రి కేటీఆర్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.
హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం మహిళల కోసం చేపట్టిన అద్భుతమైన సంక్షేమ, సంరక్షణ, కార్యక్రమాల నేపథ్యంలో International Women's Day celebrationsకు TRS పార్టీ పిలుపునిచ్చింది. ఈ మేరకు పార్టీ శాసన సభ్యులు, జిల్లా అధ్యక్షులతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి KTR టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈనెల 6, 7, 8 తేదీలో మహిళబందు KCR పేరిట సంబరాలు జరుగుతాయని తెలిపారు.
6 తేదీన సంబరాల ప్రారంభం
- కెసిఆర్ గారికి రాఖీ కట్టడం
- పారిశుద్ధ్య కార్మికులు, డాక్టర్లు, ప్రతిభ కలిగిన విద్యార్థినిలు, ఆశా వర్కర్లు ఎఎన్ఎంలు స్వయం సహాయక సంఘాల నాయకురాళ్లు తదితర మహిళలకు గౌరవపూర్వక సన్మానం
- కెసిఆర్ కిట్, షాదీ ముబారక్ థాంక్యూ కెసిఆర్ వంటి ఆకారం వచ్చేలా మానవహారాలు ఏర్పాటు చేయడం
7 తేదీన...
- మహిళా సంక్షేమ కార్యక్రమాలు అయిన కల్యాణలక్ష్మి, కెసిఆర్ కిట్ లు, ఇతర మహిళా సంక్షేమ కార్యక్రమాల లబ్ధిదారులను నేరుగా ఇంటివద్దకెళ్లి కలవడం
-లబ్ధిదారులతో సెల్ఫీలు తీసుకోవడం
8 తేదీన...
-నియోజకవర్గ స్థాయిలో మహిళలతో సమావేశం, సంబరాలు
-గతంలో పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు రైతుబంధు వారోత్సవాలతో పాటు కెసిఆర్ గారి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించిన టిఆర్ఎస్ పార్టీ శ్రేణులకు ధన్యవాదాలు
అని కార్యక్రమం షెడ్యూల్ ను వివరించారు. 10 లక్షల మంది పేద ఇంటి ఆడబిడ్డలకు పెళ్లి చేసిన దేశంలోని తొలి ప్రభుత్వం టిఆర్ఎస్ దే అని తెలిపారు. సుమారు 11 లక్షల మంది కెసిఆర్ కిట్ లబ్ధిదారుల మైలురాయిని చేరుకుందన్నారు. ఇంతటి ఘనమైన మహిళా సంక్షేమ మైలురాళ్లను చేరుకున్న నేపథ్యంలో,నే ఈ కార్యక్రమాలకు పిలుపునిచ్చింది.
నాలుగు దశాబ్దాలకు పైగా తన రాజకీయ అనుభవంలో ఎదురైన క్షేత్రస్థాయి సమస్యలకు పరిష్కారం ఇస్తున్న గొప్ప పాలకుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ అని కొనియాడారు. క్షేత్రస్థాయి సమస్యలకు అద్భుతమైన పరిష్కారం చూపిస్తూ అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను రూపకల్పన చేశారన్నారు.
అందులో భాగంగానే మహిళా సంక్షేమానికి సంబంధించి అపూర్వమైన కార్యక్రమాలను మన ప్రభుత్వం చేపట్టిందని తెలిపారు. ఆడబిడ్డల నీటి కష్టాలను దూరం చేయాలన్న ప్రాథమిక లక్ష్యంతో దేశం ఎరుగని మిషన్ భగీరథ కార్యక్రమాన్ని కెసిఆర్ గారు విజయవంతంగా పూర్తిచేశారు. మాతా శిశు సంరక్షణ కోసం కెసిఆర్ కిట్టు పేరిట అద్భుతమైన కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రసవానికి ముందు,ప్రసవం సమయంలో, ప్రసవం తర్వాత అవసరమైన అన్ని రక్షణ కార్యక్రమాలను ఇందులో చేస్తున్నామన్నారు.
మహిళా సంక్షేమం కోసం ఇంత నిబద్ధతతో ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించిన దేశంలోని ఏకైక ప్రభుత్వం మనదేనని అన్నారు. కెసిఆర్ కిట్టు ద్వారా ఇప్పటి దాకా సుమారు 11 లక్షల మందికి 1700 కోట్ల లబ్ధి... ఒక్కొక్కరికి 13 వేల లబ్ధి చేకూరుతుందన్నారు. కెసిఆర్ కిట్ ద్వారా మాతా శిశు మరణాలు తగ్గాయని, ప్రభుత్వాసుపత్రుల్లో సురక్షిత ప్రసవాలు పెరిగాయని అన్నారు.
కల్యాణలక్ష్మి కార్యక్రమం ఒక గొప్ప మైలురాయిని చేరుకుంది. ఇప్పటిదాకా సుమారు 10 లక్షల 30 వేల మంది లబ్ధిదారులకు 9022 కోట్ల రూపాయలను ప్రభుత్వం పెళ్లి కానుక అందజేసిందన్నారు. మన ప్రభుత్వం ఒంటరి మహిళలకు, బీడీ కార్మికులకు ఆసరా పింఛన్లు ఇస్తున్నది. వడ్డీ లేని రుణాలను స్వయం సహాయక సంఘాలకు అందిస్తున్నది.
మహిళా సంరక్షణ కార్యక్రమాల్లో భాగంగా షీటీమ్స్, భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసింది. విద్యాశాఖ లోనూ అద్భుతమైన కార్యక్రమాలను చేపట్టాము. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతంతో పాటు, బాలికలకు ప్రత్యేకంగా రెసిడెన్షియల్ పాఠశాలలు, జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజీలను ఏర్పాటు చేసుకున్నాం. 70 లక్షల హెల్త్ , hygienic కిట్లను విద్యార్థులకు అందించాం. ఇతరులు బేటీ బచావో బేటీ పడావో అంటూ కేవలం నినాదాలు ఇస్తున్న సమయంలో నిజంగా విద్యార్థులను చదివించి, సంరక్షిస్తున్న ప్రభుత్వం మనదేనని చెప్పుకొచ్చారు. రాజకీయ, పారిశ్రామిక రంగాలలోనూ అనేక కార్యక్రమాలను చేపట్టామన్నారు.
