Asianet News TeluguAsianet News Telugu

ఎవరి సొమ్ముతో ఎవరు సోకులు పడుతున్నారు?.. లెక్కలు తెలుసుకోండి: బీజేపీ ఎంపీ లక్ష్మణ్‌కు కేటీఆర్ కౌంటర్

బీజేపీ ఎంపీ లక్ష్మణ్‌పై తెలంగాణ మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సోమ్ము కేంద్రానిది.. సోకు టీఆర్ఎస్‌ది అంటూ లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ స్పందించారు. ఎవరి సొమ్ముతో ఎవరు సోకులు పడుతున్నారని ప్రశ్నించారు

Minister Ktr Strong Counter To BjP Mp Laxman
Author
First Published Sep 22, 2022, 12:01 PM IST

బీజేపీ ఎంపీ లక్ష్మణ్‌పై తెలంగాణ మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సోమ్ము కేంద్రానిది.. సోకు టీఆర్ఎస్‌ది అంటూ లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ స్పందించారు. ఎవరి సొమ్ముతో ఎవరు సోకులు పడుతున్నారని ప్రశ్నించారు. తెలంగాణ సొమ్ముతో లక్ష్మణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న గరీబు ఉత్తర ప్రదేశ్ సోకులు పడుతుందని విమర్శించారు. తెలంగాణ దేశ అభివృద్ధికి దోహద పెడుతున్నందుకు థాంక్స్ చెప్పాలని అన్నారు. లెక్కలు తెలుసుకోవాలని సూచించారు. లక్ష్మణ్ వ్యాఖ్యలకు సంబంధించిన పేపర్ క్లిప్‌ను షేర్ చేశారు. 

అలాగే ట్యాక్స్ రూపంలో తెలంగాణ నుంచి కేంద్రానికి ఎంత మొత్తం వెళ్తుంది.. కేంద్రం నుంచి తెలంగాణకు తిరిగి ఎంత వస్తుందో చెబుతూ డేటా‌ను కూడా కేటీఆర్ తన పోస్టుకు జత చేశారు. ఆత్మవంచన చేసుకుంటే మీ ఇష్టమని.. కానీ ప్రజలని మభ్య పెట్టవద్దని కోరారు. 

 


ఇక, మరో ట్వీట్‌లో.. ‘‘కరువు పీడిత నేలగా ఉన్న తెలంగాణ ఈ రోజు కోటి 35 లక్షల ఎకరాల మాగాణం అయ్యింది. నాడు… సాగునీరు లేక నేర్రలు బారిన ఈ నేల నేడు… పచ్చని పైరులతో కళకళలాడుతూ నూతన రికార్డులు సృష్టిస్తోంది.  రైతుబంధు, 24×7 విద్యుత్, సాగునీటి ప్రాజెక్టులు, మిషన్ కాకతీయ ఫలాలతో వ్యవసాయం కొత్త పుంతలు తొక్కుతోంది’’ అని కేటీఆర్ పేర్కొన్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios