Asianet News TeluguAsianet News Telugu

ఖైదీ నెంబర్: 3077, జైలు జ్ఞాపకాలను గుర్తుచేసుకున్న కేటీఆర్

టీఆర్‌ఎస్‌ 20వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌ తెలంగాణ ఉద్యమకాలం నాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. 

Minister KTR Shared His prison memories
Author
Hyderabad, First Published Apr 30, 2020, 7:54 AM IST

తెలంగాణ మంత్రి కేటీఆర్  తన జైలు జ్ఞాపకాలను నెమరవేసుకున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయన జైలు జీవితం గడిపారన్న విషయం తెలిసిందే. కాగా.. అప్పటి జైలు కార్డును ఆయన తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేశారు.

టీఆర్‌ఎస్‌ 20వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌ తెలంగాణ ఉద్యమకాలం నాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. వరంగల్‌ జైలులో తాను గడిపిన రోజులకు సంబంధించిన ఓ ‘ఖైదీ గుర్తింపు కార్డు’ను ఆయన ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు.

 

‘దీక్షా దివస్‌ రోజున కేసీఆర్, ప్రొ. జయశంకర్‌ అరెస్టయ్యారు. ఆ సందర్భంలో నన్ను అరెస్టు చేసి వరంగల్‌ సెంట్రల్‌ జైలుకు తరలించారు.’అని కేటీఆర్‌ ట్వీట్‌లో రాసుకొచ్చారు. గుర్తింపు కార్డులో ఉన్న వివరాల ప్రకారం.. 2009 నవంబర్‌ 29న హన్మకొండ పోలీసులు 447/2009 కేసులో కేటీఆర్‌ను అరెస్టు చేయగా వరంగల్‌ ఆరో అదనపు ఫస్ట్‌క్లాస్‌ మేజిస్ట్రేట్‌ రిమాండు విధించారు. వరంగల్‌ సెంట్రల్‌ జైలులో కేటీఆర్‌కు 3077 నంబరును కేటాయించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios