ఈ నెల 21న హైదరాబాద్‌లో రెండో విడత డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీ.. పారదర్శకంగా అందిస్తున్నాం: మంత్రి కేటీఆర్
హైదరాబాద్ నగరంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీపై రాష్ట్ర మున్సిపల్, ఐటీ పరిశ్రమల మంత్రి కేటీఆర్ సమీక్షించారు. ఈ సమావేశంలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, మహమూద్ అలీ పాల్గొన్నారు.

హైదరాబాద్ నగరంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీపై రాష్ట్ర మున్సిపల్, ఐటీ పరిశ్రమల మంత్రి కేటీఆర్ సమీక్షించారు. ఈ సమావేశంలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, మహమూద్ అలీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈ నెల 21న హైదరాబాద్ రెండో దశ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీ నిర్వహించనున్నట్టుగా చెప్పారు. రెండో దశలో దాదాపు 13,300 ఇల్ల అందించేలా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. అత్యంత పారదర్శకంగా పేదలకు మాత్రమే డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు అందిస్తున్నామని చెప్పారు.
తెలంగాణ రాష్ట్రంలో ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పథకం భారతదేశంలో ఎక్కడా లేదని అన్నారు. 560 చదరపు అడుగుల విస్తీర్ణంలో పక్కా ఇల్లు నిర్మాణం చేసి ఇచ్చే కార్యక్రమం దేశంలోని ఏ రాష్ట్రంలో లేదని చెప్పారు. హైదరాబాద్ నగరంలో మొదటి దశ కింద 11,700 వేల ఇళ్లను ఎలాంటి ఇబ్బందులు లేకుండా పేదలకు అందించాం
డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ఎంపికలో ఎవరి ప్రమేయం లేదని కేటీఆర్ స్పష్టం చేశారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల లబ్ధిదారులను ఎంపికను ప్రభుత్వ అధికారులకే అప్పగించామని తెలిపారు. లబ్ధిదారుల ఎంపికకు కంప్యూటర్ ఆధారిత డ్రా తీస్తున్నట్లు చెప్పారు. ఎంపిక ప్రక్రియను అత్యంత పారదర్శకంగా మీడియా ముందు నిర్వహిస్తున్నామని తెలిపారు. త్వరలో హైదరాబాద్‌లో గృహలక్ష్మి పథకం ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. ఈ పథకంలో భాగంగా ఇళ్ల స్థలాలు ఉన్న వారికి ఇండ్లు నిర్మించుకునేందుకు రూ.3లక్షల ఆర్థిక సాయం అందించనున్నట్లు తెలిపారు. అయితే హైదరాబాద్ నగరంలో గృహలక్ష్మి కార్యక్రమానికి కొన్ని మార్పు చేర్పులు చేయాలని మంత్రులు సీఎం కేసీఆర్‌ను కోరారని చెప్పారు. వారు సూచించిన మార్పులకు సీఎం కేసీఆర్ సూచనప్రాయంగా అంగీకరించారని తెలిపారు.