Asianet News TeluguAsianet News Telugu

ఐటీ ఉద్యోగాలలో బెంగళూరును హైదరాబాద్ దాటింది.. రాష్ట్రంలో టీఫైబర్ నెట్ ద్వారా ఇంటర్నెట్: కేటీఆర్

భారతదేశంలో ఐటీ ఉద్యోగాల కల్పనలో హైదరాబాద్ ముందుందని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఐటీ ఉద్యోగాల కల్పనలో బెంగళూరును హైదరాబాద్ క్రాస్ చేసిందని చెప్పారు. 

Minister KTR Says Hyderabad Crossed bangalore in It sector jobs
Author
First Published Jan 9, 2023, 11:43 AM IST

భారతదేశంలో ఐటీ ఉద్యోగాల కల్పనలో హైదరాబాద్ ముందుందని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఐటీ ఉద్యోగాల కల్పనలో బెంగళూరును హైదరాబాద్ క్రాస్ చేసిందని చెప్పారు. అయితే బెంగళూరును తక్కువ చేసి చూపడం తన ఉద్దేశం కాదని అన్నారు. హైదరాబాద్‌ను చూసి వ్యాపారవేత్తలు ఆకర్షితులవుతున్నారని చెప్పారు. ఐటీ రంగంలో ఇన్నోవేషన్ ఎకో సిస్టమ్‌ను అద్భుతంగా అభివృద్ది చేశామని చెప్పారు. హైదరాబాద్ నార్త్ వైపు ఐటీ రంగాన్ని విస్తరిస్తున్నామని చెప్పారు. రెండేళ్లలో ఐటీ రంగంలో 40 వేల ఉద్యోగాలు వచ్చాయని తెలిపారు.

తెలంగాణ వచ్చాక రాష్ట్రంలో అద్భుతంగా ఐటీ రంగం అభివృద్ది చెందిందని అన్నారు. దేశంలోని ఐటీ ఉద్యోగుల్లో 20 శాతం మంది హైదరాబాద్‌లోనే ఉన్నారని చెప్పారు. ఐటీ రంగంలో తెలంగాణ ప్రగతి తమకు గర్వకారణం అని పేర్కొన్నారు.  మహిళా పారిశ్రామికవేత్తల కోసం వీ-హబ్ ఏర్పాటు చేశామని చెప్పారు. ఏ రాష్ట్రంలోనై సుస్థిర ప్రభుత్వం ఉంటేనే అభివృద్ది సాధ్యపడుతుందని అన్నారు. పెట్టుబడులకు హైదరాబాద్ అనువైన నగరం అని చెప్పారు. తొలిరెండు స్పేస్ టెక్ స్టార్టప్‌లు హైదరాబాద్‌కు చెందినవేనని అన్నారు. రాష్ట్రంలో టీఫైబర్ నెట్ ద్వారా ఇంటర్నెట్ అందిస్తామని తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios