Asianet News TeluguAsianet News Telugu

వారికి ఛార్జీలు తగ్గించండి.. రైల్వే మంత్రికి కేటీఆర్ స్పెషల్ రిక్వెస్ట్..!

మార్చి 2020 లో కరోనావైరస్ వ్యాప్తి కారణంగా రైల్వే వారి రాయితీలను నిలిపివేసినప్పటి నుండి దాదాపు నాలుగు కోట్ల మంది సీనియర్ సిటిజన్లు వారి ప్రయాణానికి పూర్తి ఛార్జీలు చెల్లించవలసి వచ్చింది.

Minister KTR Requests Central Railway Minister Over Senior Citizens rail charges
Author
Hyderabad, First Published Nov 23, 2021, 11:26 AM IST


దేశంలో సీనియర్ సిటిజన్స్ కి రైల్వే ఛార్జ్ ల విషయంలో రాయితీ ఉండేది. మిగిలిన వారితో పోలిస్తే.. వారికి టికెట్ ధర తక్కువగా ఉండేది. అయితే.. కరోనావైరస్ మహమ్మారి నేపథ్యంలో రైళ్లలో ప్రయాణించే సీనియర్ సిటిజన్లకు భారతీయ రైల్వే రాయితీ ఛార్జీలను నిలిపివేసింది.

మార్చి 2020 లో కరోనావైరస్ వ్యాప్తి కారణంగా రైల్వే వారి రాయితీలను నిలిపివేసినప్పటి నుండి దాదాపు నాలుగు కోట్ల మంది సీనియర్ సిటిజన్లు వారి ప్రయాణానికి పూర్తి ఛార్జీలు చెల్లించవలసి వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు.. రాయితీ లేకుండా.. టికెట్ కొనుగోలు చేయాల్సి వస్తోంది.

మధ్యప్రదేశ్‌కు చెందిన చంద్ర శేఖర్ గౌర్ ఈ విషయం గురించి RTI ని ప్రశ్నించారు. ఆయన చేసిన    ప్రశ్నకు సమాధానంగా, మార్చి 22, 2020 మరియు సెప్టెంబర్ 2021 మధ్య 37,850,668 మంది సీనియర్ సిటిజన్లు రైళ్లలో ప్రయాణించారని రైల్వే పేర్కొంది.

Also Read: నిన్న మేకలదొంగల చేతుల్లో ఎస్ఐ, నేడు వాహనంతో ఢీకొట్టి ఎంవీఐ హత్య.. చెన్నైలో వరుస దారుణాలు..

ఈ సమయంలో, కరోనావైరస్ ప్రేరిత లాక్‌డౌన్ కారణంగా కొన్ని నెలల పాటు రైలు సేవలు నిలిపివేయబడ్డాయి. మార్చి 2020 నుండి నిలిపివేయబడిన రాయితీలు ఈ రోజు వరకు నిలిపివేశారు. కాగా.. ఈ విషయంపై తాజాగా  తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందించారు.

ఇది చాలా దురదృష్టకరమైన పరిస్థితి ఇది అంటూ కేటీఆర్ పేర్కొన్నారు. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ని ట్యాగ్ చేసి.. ఈ విషయాన్ని పర్యవేక్షించాలని కేటీఆర్ కోరారు. దయచేసి.. అర్హులైన సీనియర్ సిటిజన్లు అందరికీ.. ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. 

Follow Us:
Download App:
  • android
  • ios