సీఆర్‌పీఎఫ్ పరీక్షలను ప్రాంతీయ భాషల్లోనూ నిర్వహించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ లేఖ రాశారు. పోటీ పరీక్షలను 12 భారతీయ భాషల్లో నిర్వహించాలన్న జాతీయ నియామక సంస్థ సూచనను కేటీఆర్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. 

కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ లేఖ రాశారు. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్) ఉద్యోగ పరీక్షలను ప్రాంతీయ భాషల్లోనూ నిర్వహించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ పరీక్షలను ఆంగ్లం, హిందీల్లో నిర్వహిస్తున్నారని.. దీని వల్ల ఇంగ్లీష్‌, హిందీలను చదవని అభ్యర్ధులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని కేటీఆర్ లేఖలో పేర్కొన్నారు. ఇకపై తెలుగు, తమిళ, కన్నడ, మలయాళంతో పాటు రాజ్యాంగం గుర్తించిన భాషల్లోనూ కేటీఆర్ కోరారు. పోటీ పరీక్షలను 12 భారతీయ భాషల్లో నిర్వహించాలన్న జాతీయ నియామక సంస్థ సూచనను కేటీఆర్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. 

ఇకపోతే.. పోటీ పరీక్ష కోసం సిద్ధమవుతున్న అభ్యర్థులకు కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది జనవరిలో శుభవార్త చెప్పింది. తెలుగు రాష్ట్రాల విద్యార్థులు ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్న ఓ విషయంలో కేంద్రం సానుకూలంగా స్పందించింది. కేంద్ర ప్రభుత్వ రిక్రూట్ మెంట్ ఏజెన్సీ అయిన స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్షలు ఇక నుంచి తెలుగులోనూ ఉండనున్నాయి. తెలుగుతో పాటు మొత్తంగా 13 ప్రాంతీయ భాషల్లోనూ ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. 

ALso Read: నిరుద్యోగులకు శుభవార్త.. ఇక తెలుగులోనూ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్షలు..

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అనేది కేంద్ర ప్రభుత్వ అతి పెద్ద రిక్రూటింగ్ ఏజెన్సీలలో ఒకటి. ఇది వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖలు, విభాగాల్లోని అన్ని గ్రూప్ బీ, (నాన్-గెజిటెడ్), గ్రూప్ సీ (నాన్-టెక్నికల్) పోస్టులను భర్తీ చేస్తుంది. అయితే ఇంత కాలం ఈ కమిషన్ నిర్వహించిన అన్ని పరీక్షల్లో కేవలం హిందీ, ఇంగ్లీష్ మాధ్యమంలోనే ప్రశ్నలు వచ్చేవి. దీనిపై చాలా కాలం నుంచి ఉద్యోగార్థులు సంతృప్తిగా ఉన్నారు. 

ఇలా రెండు భాషల్లోనే పరీక్షలు నిర్వహించడం వల్ల ముఖ్యంగా ఉత్తర భారతదేశ అభ్యర్థులే ఎక్కువగా లబ్ది పొందుతున్నారనే విమర్శలు ఉన్నాయి. ఉత్తర భారతదేశంలో ఉండే అభ్యర్థులకు హిందీ మాతృభాషగా ఉంటుంది. దీంతో వారికి సులభంగా ప్రశ్నలు అర్థయ్యేవి. దీంతో వారే ఎక్కువగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు సాధించేవారు. ఇతర దక్షిణ భారతదేశ అభ్యర్థులకు హిందీ అంతంత మాత్రంగానే రావడం వల్ల ఉద్యోగాలు పెద్ద సంఖ్యలో సాధించలేకపోయేవారు. దీనిపై చాలా కాలం నుంచి విమర్శలు వస్తున్నాయి. 

ఎస్ఎస్ సీ పరీక్షలు తెలుగులోనూ నిర్వహించాలని తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు చాలా కాలం నుంచి డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంలో తెలంగాణ మంత్రి కేటీఆర్, సీఎం కేసీఆర్ కూడా పలు మార్లు కేంద్ర ప్రభుత్వానికి, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ బోర్డుకు లేఖలు రాశారు. పలు సందర్భాల్లో బహిరంగ సభల్లో కూడా మంత్రి కేటీఆర్ ఈ విషయాన్ని ప్రస్తావించారు. 

Scroll to load tweet…