Asianet News TeluguAsianet News Telugu

నిరుద్యోగులకు శుభవార్త.. ఇక తెలుగులోనూ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్షలు..

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్షలు ఇక నుంచి తెలుగులోనూ నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది. తెలుగుతో పాటు మరో 12 ప్రాంతీయ భాషల్లోనూ పరీక్షలు చేపట్టాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.

Good news for the unemployed.. Staff Selection Commission exams in Telugu too..
Author
First Published Jan 22, 2023, 1:14 PM IST

పోటీ పరీక్ష కోసం సిద్ధమవుతున్న అభ్యర్థులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. తెలుగు రాష్ట్రాల విద్యార్థులు ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్న ఓ విషయంలో కేంద్రం సానుకూలంగా స్పందించింది. కేంద్ర ప్రభుత్వ రిక్రూట్ మెంట్ ఏజెన్సీ అయిన స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్షలు ఇక నుంచి తెలుగులోనూ ఉండనున్నాయి. తెలుగుతో పాటు  మొత్తంగా 13 ప్రాంతీయ భాషల్లోనూ ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. 

పఠాన్ సినిమాపై ఆందోళనలు:అసోం సీఎం బిశ్వశర్మకు బాలీవుడ్ నటుడు షారూక్ ఖాన్ ఫోన్

మొట్ట మొదటి సారిగా హిందీ, ఇంగ్లీషుతో పాటు 13 ప్రాంతీయ భాషలలో మల్టీ-టాస్కింగ్ (నాన్-టెక్నికల్) స్టాఫ్ ఎగ్జామినేషన్- 2022ను నిర్వహించనున్నట్టు శుక్రవారం ఆ ఏజెన్సీ అధికారంగా ప్రకటన విడుదల చేసింది. ఇందులో ఉర్దూ, తమిళం, మలయాళం, తెలుగు, కన్నడ, అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, కొంకణి, మణిపురి, మరాఠీ, ఒడియా, పంజాబీ ఉన్నాయి. దీంతో అనేక మంది నిరుద్యోగులకు లబ్ది చేకూరనుంది.

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అనేది కేంద్ర ప్రభుత్వ అతి పెద్ద రిక్రూటింగ్ ఏజెన్సీలలో ఒకటి. ఇది వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖలు, విభాగాల్లోని అన్ని గ్రూప్ బీ, (నాన్-గెజిటెడ్), గ్రూప్ సీ (నాన్-టెక్నికల్) పోస్టులను భర్తీ చేస్తుంది. అయితే ఇంత కాలం ఈ కమిషన్ నిర్వహించిన అన్ని పరీక్షల్లో కేవలం హిందీ, ఇంగ్లీష్ మాధ్యమంలోనే ప్రశ్నలు వచ్చేవి. దీనిపై చాలా కాలం నుంచి ఉద్యోగార్థులు సంతృప్తిగా ఉన్నారు. 

ఏపీకి బదలాయించిన ఆ నిధులను ఇప్పించండి.. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌కు హరీష్ రావు లేఖ..

ఇలా రెండు భాషల్లోనే పరీక్షలు నిర్వహించడం వల్ల ముఖ్యంగా ఉత్తర భారతదేశ అభ్యర్థులే ఎక్కువగా లబ్ది పొందుతున్నారనే విమర్శలు ఉన్నాయి. ఉత్తర భారతదేశంలో ఉండే అభ్యర్థులకు హిందీ మాతృభాషగా ఉంటుంది. దీంతో వారికి సులభంగా ప్రశ్నలు అర్థయ్యేవి. దీంతో వారే ఎక్కువగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు సాధించేవారు. ఇతర దక్షిణ భారతదేశ అభ్యర్థులకు హిందీ అంతంత మాత్రంగానే రావడం వల్ల ఉద్యోగాలు పెద్ద సంఖ్యలో సాధించలేకపోయేవారు. దీనిపై చాలా కాలం నుంచి విమర్శలు వస్తున్నాయి. 

ఎస్ఎస్ సీ పరీక్షలు తెలుగులోనూ నిర్వహించాలని తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు చాలా కాలం నుంచి డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంలో తెలంగాణ మంత్రి కేటీఆర్, సీఎం కేసీఆర్ కూడా పలు మార్లు కేంద్ర ప్రభుత్వానికి, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ బోర్డుకు లేఖలు రాశారు. పలు సందర్భాల్లో బహిరంగ సభల్లో కూడా మంత్రి కేటీఆర్ ఈ విషయాన్ని ప్రస్తావించారు. 

ఉత్తరాఖండ్‌లోని పితోర్‌‌ఘర్‌ జిల్లాలో భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 3.8గా నమోదు..

అయితే ఎట్టకేలకు ఎంతో మంది అభ్యర్థులకు ప్రయోజనం చేకూర్చే నిర్ణయంపై కేంద్రం సానుకూలంగా స్పందించింది. ఈ విషయంలో కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పింఛన్ల శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ మాట్లాడుతూ.. ఉద్యోగ ఔత్సాహికులందరికీ సమాన అవకాశాలు కల్పించాలనే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దార్శనికతకు అనుగుణంగా ఈ చర్య తీసుకున్నట్లు చెప్పారు. భాష వల్ల ఎవరి అవకాశాలు చేజారిపోకూడదని అన్నారు. తమ నిర్ణయం వివిధ రాష్ట్రాల అభ్యర్థులు, ముఖ్యంగా దక్షిణ భారతదేశ అభ్యర్థుల డిమాండ్ ను నెరవేర్చిందని అన్నారు. కాగా.. పరీక్షలను నిర్వహించే మాధ్యమంతో పాటు కమిషన్ నిర్వహించే పరీక్షల పథకం, సిలబస్‌ను సమీక్షించడానికి సిబ్బందిచ శిక్షణ శాఖ నిపుణుల కమిటీని ఏర్పాటు చేసిందని మంత్రి చెప్పారు.

Follow Us:
Download App:
  • android
  • ios