కరీంనగర్ జిల్లాను మరింత సుందరంగా తీర్చిదిద్దే మానేరు రివర్ ప్రంట్ పనులు రేపు గురువారం నుండి ప్రారంభంకానున్నారు.మంత్రి కేటీఆర్ ఈ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. 

కరీంనగర్: టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రస్తుతం చేపట్టిన పనులతో భవిష్యత్ లో కరీంనగర్ (karimnagar) సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకోనుంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాంత అభివృద్దికే కాదు పర్యాటల ప్రాంతాలను ప్రత్యేక శ్రద్దతో సుందరంగా తీర్చిదిద్దుతోంది. రూ.400 కోట్లతో మానేరు రివర్ ప్రంట్, మెడికల్ కాలెజ్, శ్రీనివాసుని దివ్యధామం, ఐటీ విస్తరణ పనులు కొనసాగుతున్నాయి. గురువారం కరీంనగర్ జిల్లాలో పర్యటించనున్న మంత్రి కేటీఆర్ అభివృద్ది పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఇక ఇప్పటికే పట్టణంలో నిర్మించిన బీసీ స్టడీ సర్కిల్ నూతన భవనాన్ని మంత్రి ప్రారంభించనున్నారు. 

video

ఇక 490 కోట్ల రూపాయల నిధులతో రూపుదిద్దుకోనున్న మానేరు రివర్‌ఫ్రంట్ పనులకు అధికార యంత్రాంగం సర్వం సిద్దం చేసింది. రేపు మంత్రి కేటీఆర్ మానేరు రివర్‌ఫ్రంట్ మొదటి దశ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. మానేరు వంతెనపై మంత్రి కేటీఆర్ వాటర్ పైలాన్ ను అవిష్కరించనున్నారు.

కేటీఆర్ (KTR) పర్యటన సందర్భంగా ఆయనకు స్వాగతం పలుకుతూ కరీంనగర్ టీఆర్ఎస్ నాయకులు భారీఎత్తున ప్లెక్సీలు, హోర్డింగ్స్ ఏర్పాటుచేసారు. రోడ్లపై గులాబీ జెండాలు, తోరణాలను ఏర్పాటుచేసారు. దీంతో కరీంనగర్ పట్టణమంతా గులాబీమయం అయ్యింది.

అలాగే మానేరు నదిపై రూ.148 కోట్ల వ్యయంతో చేపట్టిన తీగల వంతెన నిర్మాణం ఇప్పటికే పూర్తయ్యింది. అయితే ఈ బ్రిడ్జిని మరింత సుందరంగా ముస్తాబు చేసేందుకు మరిన్ని నిధులను ప్రభుత్వం కేటాయించింది. డిజిటల్ లైటింగ్, అనుసంధాన రహదారులు పనుల కోసం మరో రూ. 76 కోట్లను ఖర్చుచేసి కేబుల్ బ్రిడ్జికి మరిన్ని అందాలు అద్దనున్నారు. 

రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో కరీంనగర్ లో పర్యటించిన సందర్భంగా దిగువ మానేరు సుందరీకరణపై ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తీగల వంతెన, మానేరు రివర్ ఫ్రంట్ సాధ్యమయ్యింది. ఇప్పటికే తీగల వంతెన నిర్మాణం పూర్తయి మరింత అందంగా తీర్చిదిద్దే పనులు జరుగుతున్నాయి. మరోవైపు రేపు కేసీఆర్ చేతులమీదుగా రివర్ ప్రంట్ పనులు కూడా ప్రారంభంకానున్నాయి. 

రివర్ ప్రంట్ ప్రాజెక్ట్ లో భాగంగా సివిల్, టూరిజం డిపార్మెంట్లు పలు డిజైన్లతో కూడిన ఫౌంటెయిన్లు, నాలుగు నుంచి ఆరు వరకు పడవలు, లేజర్ షో, నైట్ గార్డెన్, వాటర్ క్లాక్, థీమ్ వర్క్, వాటర్ స్పోర్ట్స్, డిజిటల్ లైటింగ్ సిస్టమ్, మ్యూజికల్ ఫౌంటెయిన్లు, హోటళ్లు నిర్మిస్తారు. వీటిని అత్యంత సుందరంగా పర్యాటకులను ఆకట్టుకునేలా నిర్మించబోతున్నారు. 10 కిలో మీటర్ల పొడవునా నీరు నిలిచి ఉండే విదంగా సరికొత తరహాలో చెక్ డ్యామ్, నాలుగు గేట్లతో బ్యారేజిని నిర్మిస్తారు. ఇరువైపులా గోడలు, మెట్లు కూడా నిర్మిస్తారు. ఆహ్లాదం కలిగించేలా పచ్చదనం పెంచుతారు. ఎలాంటి ఆటంకాలు లేకుండా పనులు సాగితే ఇరవై నాలుగు నెలల్లోనే ఇదంతా సాకారం కాబోతుంది.