Asianet News TeluguAsianet News Telugu

మారుమూల ప్రాంతాలకూ అత్యవసర వైద్యం.. మొబైల్‌ ఐసీయూ బస్సులు ప్రారంభించిన కేటీఆర్‌

తెలంగాణలోని మారుమూల ప్రాంతాల్లోని కరోనా బాధితులకు వైద్య సేవలు అందించేందుకు ప్రత్యేకంగా మొబైల్ యూనిట్లను సిద్ధం చేసింది ప్రభుత్వం. దీనిలో భాగంగా 30 ఐసీయూ బస్సుల్ని హైదరాబాద్‌లో మంత్రి కేటీఆర్ ఇవాళ ప్రారంభించారు. 

minister ktr inaugurating mobile icu buses ksp
Author
Hyderabad, First Published Jun 3, 2021, 4:20 PM IST

తెలంగాణలోని మారుమూల ప్రాంతాల్లోని కరోనా బాధితులకు వైద్య సేవలు అందించేందుకు ప్రత్యేకంగా మొబైల్ యూనిట్లను సిద్ధం చేసింది ప్రభుత్వం. దీనిలో భాగంగా 30 ఐసీయూ బస్సుల్ని హైదరాబాద్‌లో మంత్రి కేటీఆర్ ఇవాళ ప్రారంభించారు. మొదటి దశలో జిల్లాకు ఒకటి చొప్పున ఇస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. త్వరలో జిల్లాకు రెండు చొప్పున బస్సుల్ని కేటాయిస్తామన్నారు. దేశంలో ఇలా సేవలను అందించడం ఇదే తొలిసారి అన్నారు మంత్రి కేటీఆర్. 

Also Read:చాయ్ వాలా దయనీయ పరిస్థితి... ఆపన్నహస్తం అందించిన కేటీఆర్

కొవిడ్‌ వల్ల ఆరోగ్య సిబ్బంది గొప్పతనం అందరికీ తెలిసిందని.. ప్రస్తుతం వారిని దేవుడితో సమానంగా చూస్తున్నారని పేర్కొన్నారు. 
మెడికల్‌ యూనిట్‌ బస్సులో వైద్య సేవల కోసం ఒక డాక్టర్‌, ఇద్దరు నర్సులతో పాటు 10 బెడ్లు అందుబాటులో ఉంటాయని కేటీఆర్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. వెరాస్మార్ట్ హెల్త్ కేర్ సహకారంతో లార్డ్స్‌ చర్చి ఈ ప్రాజెక్టును ప్రారంభించింది. బస్సులను ప్రారంభించిన అనంతరం బస్సులో ఉన్న వైద్య సదుపాయాలను కేటీఆర్‌ పరిశీలించారు.

 


 

Follow Us:
Download App:
  • android
  • ios