కేసీఆర్ ఎక్కడ : సీఎం ఆరోగ్యంపై వదంతులు, కేటీఆర్ క్లారిటీ.. టైం పడుతుందంటూ కామెంట్స్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్యంపై క్లారిటీ ఇచ్చారు ఆయన కుమారుడు, మంత్రి కేటీఆర్. ముఖ్యమంత్రికి ఛాతీలో సెకండరీ ఇన్‌ఫెక్షన్ వచ్చిందని.. కొద్దిరోజుల క్రితం వైరల్ ఫీవర్, ఇప్పుడు బ్యాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్ రావడంతో కోలుకోవడానికి టైం పడుతుందని కేటీఆర్ స్పష్టం చేశారు.

minister ktr gave clarity on telangana cm kcr health condition ksp

గత కొద్దిరోజులుగా తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కనిపించడం లేదు. దీంతో బీజేపీ ఎంపీ బండి సంజయ్ లాంటి వాళ్లు కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. కేసీఆర్‌ను కేటీఆర్ ఇబ్బంది పెడుతున్నారని.. సంతోష్ కుమార్‌ను కూడా దూరం పెట్టారని ఆరోపించారు. మా ముఖ్యమంత్రితో ఒక్క ప్రెస్ మీట్ పెట్టించి.. ఆయనను తమకు చూపించాలంటూ బండి సంజయ్ వ్యాఖ్యానించారు. కేసీఆర్ గురించి మీడియా, సోషల్ మీడియాలోనూ తీవ్ర చర్చ జరుగుతోంది.

ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ స్పందించారు. శుక్రవారం ఓ జాతీయ మీడియా సంస్థ ప్రతినిధితో ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రికి ఛాతీలో సెకండరీ ఇన్‌ఫెక్షన్ వచ్చిందని.. కొద్దిరోజుల క్రితం వైరల్ ఫీవర్, ఇప్పుడు బ్యాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్ రావడంతో కోలుకోవడానికి టైం పడుతుందని కేటీఆర్ స్పష్టం చేశారు. కాగా.. వైరల్ ఫీవర్ కారణంగా సీఎం కేసీఆర్ గత 3 వారాలుగా రాష్ట్ర ప్రజలకు దూరంగా వుంటున్న సంగతి తెలిసిందే. 

ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ స్పందించారు. ముఖ్యమంత్రికి ఛాతీలో సెకండరీ ఇన్‌ఫెక్షన్ వచ్చిందని.. కొద్దిరోజుల క్రితం వైరల్ ఫీవర్, ఇప్పుడు బ్యాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్ రావడంతో కోలుకోవడానికి టైం పడుతుందని కేటీఆర్ స్పష్టం చేశారు. కాగా.. వైరల్ ఫీవర్ కారణంగా సీఎం కేసీఆర్ గత 3 వారాలుగా రాష్ట్ర ప్రజలకు దూరంగా వుంటున్న సంగతి తెలిసిందే. 

కాగా.. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ రెండ్రోజుల క్రితం మీడియాతో మాట్లాడుతూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు. 15 రోజులుగా సీఎం కేసీఆర్ కనిపించడం లేదని.. కేటీఆర్‌పై అనుమానంగా వుందంటూ వ్యాఖ్యానించారు. మోడీపై కేసీఆర్ కుమారుడు అజయ్ రావు విషం నింపుకున్నాడని.. 4 కోట్ల మంది కోసం తెలంగాణ తెచ్చుకుంటే అది నలుగురి పాలైందని బండి సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. మోడీ తెలంగాణ పర్యటన తర్వాత బీఆర్ఎస్‌లో ప్రకంపనలు మొదలయ్యాయని ఆయన అన్నారు. సీఎం కేసీఆర్‌తో ఒక ప్రెస్‌మీట్ పెట్టించాలని.. మా ముఖ్యమంత్రిని ఒకసారి చూపించాలంటూ సంజయ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

ALso Read: 15 రోజులుగా కేసీఆర్ కనిపించడం లేదు.. కేటీఆర్‌పైనే అనుమానం , మా సీఎంను చూపించండి : సంజయ్ కీలక వ్యాఖ్యలు

కేసీఆర్‌ను కేటీఆర్ ఏమైనా చేశారా ? ఏమైనా ఇబ్బంది పెడుతున్నాడా..? ఎందుకంటే ఆయన మా సీఎం.. ఆయనను కాపాడుకోవాల్సిన బాధ్యత మాపై ఉందని సంజయ్ వ్యాఖ్యానించారు. కేసీఆర్ ప్రెస్‌మీట్ పెడితేనే ఆయన క్షేమంగా వున్నారని నమ్ముతామని అన్నారు.  కేసీఆర్ దగ్గరకు ఎవరినీ వెళ్లనీయడం లేదని.. అఖరికి ఎంపీ సంతోష్‌రావును కూడా దూరం పెట్టారని ఆరోపించారు. కేసీఆర్ కనబడితే క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నట్టుగా సంజయ్ చెప్పారు. నిజామాబాద్‌లో మోదీ చేసిన వ్యాఖ్యలపై కేసీఆర్ సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. 

మోదీని ప్రపంచ దేశాలు ఒక హీరోలా చూస్తున్నాయని అన్నారు. దేశ ప్రధాని మీద బీఆర్ఎస్, కేసీఆర్ కుటుంబం చిల్లర ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణలో నలుగురు మాత్రమే బాగుండాలని కొరుకుంటున్నారని బీఆర్‌ఎస్‌పై బండి సంజయ్ విమర్శలు గుప్పించారు. వేరే వ్యక్తి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఎందుకు కావడం లేదని ప్రశ్నించారు. మోదీ పర్యటన తర్వాత ప్రగతిభవన్‌లో భూకంపం వస్తుందని అన్నారు. మోదీ కుండబద్దలు కొట్టినట్టుగా మాట్లాడితే కేసీఆర్ కుటుంబంలో లొల్లిలు మొదలయ్యాయని అన్నారు. 


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios