కేంద్రం ప్రకటించే స్వచ్ఛ సర్వేక్షన్ ర్యాంకింగ్‌లో హైదరాబాద్ నిరంతరం ముందు నిలుస్తోందని తెలంగాణ రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ (Minister KTR) తెలిపారు. హైదరాబాద్‌లో సోమవారం స్వచ్ఛ ఆటోలను (Swachh Auto) మంత్రి కేటీఆర్ పచ్చ జెండా ఊపి ప్రారంభించారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గదర్శకంలో హైదరాబాద్‌ను స్వచ్చ నగరంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ (Minister KTR) తెలిపారు. హైదరాబాద్‌లో సోమవారం స్వచ్ఛ ఆటోలను (Swachh Auto) మంత్రి కేటీఆర్ పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, మేయర్ విజయలక్ష్మీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. స్వచ్ఛ హైదరాబాద్, స్వచ్ఛ తెలంగాణలో భాగంగా మున్సిపాలిటీలో స్వచ్ఛ వాహనాలను ప్రారంభింస్తున్నామని తెలిపారు. హైదరాబాద్ (Hyderabad) నగర ప్రజలకు మెరుగైన పారిశుద్ధ్యాన్ని అందిస్తున్నామని చెప్పారు.
హైదరాబాద్ నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు నాడు కేసీఆరే స్వయంగా 2500 స్వచ్ఛ ఆటోలను ప్రారంభించారని గుర్తుచేశారు.అంతకుముందు.. నగరంలో 3500 మెట్రిక్ టన్నుల చెత్త ఉత్పత్తి అయ్యేదని.. ఈ ఆటో టిప్పర్లు ఇంటింటికీ తిరిగి చెత్త సేకరించడం వల్ల.. 6500 మెట్రిక్ టన్నుల చెత్త ఉత్పత్తి అవుతోందని చెప్పారు. మొత్తంగా చెత్తను డంప్ యార్డులకు తరలిస్తున్నారు. సీఎం కేసీఆర్ సఫాయి కార్మికులను గౌరవిస్తు సఫాయన్న నీకు సలామన్న అని అన్నారని మంత్రి తెలిపారు. సఫాయి కార్మికులు అడగకముందే మూడు సార్లు జీతాలు పెంచారని చెప్పారు.
గత ఆరేళ్లలో హైదరాబాద్‌లో చెత్త సేకరణ ఎంతో మెరుగుపడిందన్నారు. ఇందుకు సహకరిస్తున్న పారిశుద్ద్య కార్మికులకు ఆయన అభినందనలు తెలిపారు. కేంద్రం ప్రకటించే స్వచ్ఛ సర్వేక్షన్ ర్యాంకింగ్ లో హైదరాబాద్ ముందు నిలుస్తోందన్నారు. నగరంలో ఇంటింటికి తిరిగి చెత్తను కార్మికులు చెత్తను సేకరిస్తున్నారన్నారు. నగంలోరి ప్రతి గల్లికి వెళ్లి చెత్త సేకరణ జరుగుతుందని అన్నారు.
‘నేడు ప్రారంభించిన 1350 వాహనాలతో కలిపితే.. 5750 పైచిలుకు వాహనాలు జీహెచ్ఎంసీలో అందుబాటులో ఉన్నాయి. నగర ప్రజలకు మెరుగైన పారిశుద్ధ్యాన్ని అందిస్తున్నాం. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో దక్షిణ భారతదేశంలోనే అతిపెద్దదైన చెత్త నుంచి విద్యుత్తు ఉత్పత్తి చేసే 20 మెగావాట్ల ప్లాంట్‌లో జీహెచ్ఎంసీ పరిధిలోని జవహర్ నగర్‌లో ప్రారంభించాం. మరో 28 మెగావాట్ల ప్లాంట్‌కు పర్యావరణ అనుమతులు లభించాయి. రాబోయే రోజుల్లో మొత్తం చెత్తను రీసైకిల్ చేస్తాం’ అని తెలిపారు.
