అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సిరిసిల్ల నియోజక వర్గంలో మంత్రి కేటీఆర్ పర్యటించారు. ఈ సందర్భంగా సిరిసిల్ల ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీకి ఓటు  వేస్తె అది మనకు మరణ శాసనం అవుతుందన్నారు. మన వేలితో మన కంటిని పొడుచుకుని ప్రయత్నం చేయొద్దని ప్రజలకు సూచించారు.  పోరాడి సాధించుకున్న రాష్ట్రాన్ని ఎట్టి పరిస్థితుల్లో వారి చేతుల్లో పెట్టకూడదని కేటీఆర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలంటే, తిరిగి టీఆర్ఎస్ పార్టీని గెలిపించుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.  

ఈసందర్భంగా వివిధ కుల సంఘాలు టీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తామని ఏకగ్రీవ తీర్మానం చేయడం పట్ల మంత్రి కేటీఆర్ వారికి ధన్యవాదాలు తెలియజేశారు. రోడ్ షో సందర్భంగా, బోనాలు, బతుకమ్మలతో మంత్రికి పెద్ద ఎత్తున సిరిసిల్ల నియోజకవర్గ ప్రజలు స్వాగతం పలికారు.

కేటీఆర్ ప్రసంగాన్ని కింది వీడియోలో చూడండి

మరిన్ని వార్తలు

అలా అడిగితే ఇలా చెప్పా: చంద్రబాబుపై కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఎన్టీఆర్ మీద కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు

అమరావతికి ప్రధాని మట్టినీళ్లు, కేసిఆర్ వెనక్కి...: కేటీఆర్