హైద్రాబాద్ మణికొండలో ఈ నెల 25న తేదీన డ్రైనేజీలో పడిన రజనీకాంత్ అనే వ్యక్తి డెడ్‌బాడీ సోమవారం నాడు లభ్యమైంది. నెక్నామ్ చెరువులో  రజనీకాంత్ మృతదేహం ఇవాళ లభ్యమైంది. మూడు రోజులుగా రజనీకాంత్  కోసం  గాలింపు చర్యలు చేపట్టారు. 

హైదరాబాద్: హైద్రాబాద్(hyderabad) మణికొండలో (Manikonda) లో ఈ నెల 25వ తేదీన డ్రైనేజీలో పడిన రజనీకాంత్ మృతదేహన్ని సోమవారం నాడు నెక్నామ్ చెరువులో గుర్తించారు.ఈ నెల 25వ తేదీన మణికొండలో రోడ్డు దాటుతున్న సమయంలో మూతలేని మ్యాన్ హోల్ లో రజనీకాంత్ అనే టెక్కీ పడి కొట్టుకుపోయాడు. మూడు రోజులుగా రజనీకాంత్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. 

సోమవారం నాడు నెక్నామ్ చెరువు వద్ద ఓ గుర్తు తెలియని మృతదేహన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. బురదలో ఈ మృతదేహం కూరుకుపోయింది. అయితే బురద కారణంగా ఈ మృతదేహన్ని గుర్తించలేదు. చివరికి ఈ డెడ్‌బాడీ రజనీకాంత్‌దిగా గుర్తించారు.

also read:మణికొండలో డ్రైనేజీలో పడి వ్యక్తి గల్లంతు.. కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్

మణికొండలోని గోల్డెన్ ఏరియాలో మూడు నెలలుగా డ్రైనేజీ పనులు జరుగుతున్నాయి. అయితే ఈ విషయమై అధికారులు ఎలాంటి ముందుజాగ్రత్త చర్యలు తీసుకోలేదు.శనివారం నాడు ఇదే ప్రాంతంలో రోడ్డు దాటుతున్న రజనీకాంత్ ప్రమాదవశాత్తు డ్రైనేజీలో పడి మరణించాడు. మూడు రోజుల తర్వాత ఆయన డెడ్ బాడీ లభించింది.