నల్లగొండ మున్సిపల్ ఛైర్ పర్సన్ బొడ్డుపల్లి లక్ష్మి భర్త బొడ్డుపల్లి శ్రీనివాస్ మరణంపై తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి సీరియస్ కామెంట్స్ చేశారు. బుధవారం తుంగతూర్తి లో జరిగిన ప్రగతి సభలో మంత్రులు కేటిఆర్, జగదీష్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో జగదీష్ రెడ్డి మాట్లాడారు. ఆయన మాట్లాడిన మాటలు కింద చదవండి.

తెలంగాణ రాష్ట్ర భవిష్యత్ ఆశాకిరణం మంత్రి కేటీఆర్. నియోజకవర్గం మరచి పోయిన నేతలు మళ్ళీ వస్తున్నారు. చింతమడక నుండి తెలంగాణా రాష్ట్రంలోని పదివేల గ్రామాలలో అభివృద్ధి జరుగుతున్నది. రాజకీయ ఘర్షణలకు తావు లేకుండా తుంగతుర్తి నియోజకవర్గంలలో  అభివృద్ధి జరుగుతున్నది.

మేము తన్నాల్సి వస్తే జిల్లాలో ఒక్క కాంగ్రేస్ నేత  మిగలరు. కానీ ఆ పని మేము చెయ్యం. తన్నాలిసి వస్తే ప్రజలే మిమ్మల్ని తంతారు. అది కూడ బ్యాలెట్ అనే అయుధం ద్వారానే జరుగుతుంది. నల్గొండలో తాగి తన్నుకొనీ సస్తే టి ఆర్ యస్ కు ఆపాదించడం వారి విజ్ణతకు వదిలి పెడుతున్నాం. అది కాంగ్రెస్ పార్టీ అంతర్గత కుమ్ములాటలకు నిదర్శనం తప్ప మరొకటి కాదు.

టి ఆర్ యస్ పార్టీ అధికారంలోకి వచ్చాకా ఎక్కడ కూడ గొడవలకు అవకాశం ఇవ్వలేదు. 30 నెలలలో 30 వేల కోట్లతో ఉమ్మడి నల్గొండ జిల్లాను అభివృద్ధి చేసుకున్న చరిత్ర టిఆర్ఎస్ పార్టీదీ. అందుకు సహకరించిన ముఖ్యమంత్రి కెసియార్ కు ధన్యవాదాలు.

ఉమ్మడి రాష్ట్రంలో ఏనాడూ రెండు మార్లకంటే ఏ  ముఖ్యమంత్రి కూడ ఎక్కువ మార్లు పర్యటించిన దాఖలాలు లేవు. కానీ  ఇప్పటికే నల్గొండ జిల్లాలో 19 మార్లు పర్యటించిన ఘనత ముఖ్యమంత్రి కెసియార్ కే దక్కింది. రాబోయే ఎన్నికలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12 శాసనసభ, రెండు లోకసభ స్థానాలలో టిఆర్ఎస్ విజయం సాదించబోతుంది.

గతంలో తుంగతుర్తి నియోజకవర్గంలో ప్రగతి సభ జరుపుకున్న సందర్భం లేనే లేదు. ఇక్కడ రాజకీయ ఘర్షణలతో పరస్పర దాడులతో హత్యలకు గురి అయితే సంతాపసభలు మాత్రమే నిర్వహించ కునే వారం. అందుకు భిన్నంగా ఇప్పడు ముఖ్యమంత్రి కెసియార్ నేత్రుత్వంలో 150 కోట్లతో 175 ఆవాస గ్రామాలకు మంచినీరు అందించే కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం.