2019లో కాంగ్రెసోళ్ళను జనాలే మోరిల పడేస్తరు-మంత్రి జగదీష్ రెడ్డి

2019లో కాంగ్రెసోళ్ళను జనాలే మోరిల పడేస్తరు-మంత్రి జగదీష్ రెడ్డి

నల్గొండసభలో కాంగ్రేస్ నేతల ప్రసంగాల పైన విరుచుకు పడిన మంత్రి జగదీష్ రెడ్డి.. మోరిలలో పడేది టి.ఆర్.యస్ కార్యకర్తల తలలు కాదు, కాంగ్రేస్ పార్టీ నేతల పదవులు అన్నారు. భాషను మార్చుకోకపోతే ప్రజలే కాంగ్రెస్ నేతల బట్టలు పీకి మోరిలలో వేసే రోజులు ముందున్నాయన్నారు. అటువంటి భాషను వాడుతున్నప్పుడు వేదిక మీద జానారెడ్డి లాంటి వారు వారించక పోవడం సభ్యసమాజం సిగ్గుతో తల దించుకుంటుందన్నారు. తాగి తన్నుకున్న పంచాయతీలో టి.ఆర్.యస్ ను లాగి బదనాం చేస్తున్నారన్నారు.

 

టి.ఆర్.యస్ కార్యకర్తల తలలు తెంపి మోరిలలో మొండేలను వేస్తాం, ఎమ్మెల్యేలను బట్టలు విప్పి కొడతామంటూ వాడిన పదాలు కాంగ్రేస్ పార్టీ సంస్కృతిని, వేదిక మీద ఉన్న జానా, ఉత్తమ్ జైపాల్ వంటి నేతల నాయకత్వానికి అద్దం పడుతున్నాయన్నారు. ఇంతకాలం మిమ్మల్ని మోసిన ప్రజలే మీ పదవులను ఉడబీకీ మోరిలలో వేసేందుకు సిద్దంగా ఉన్నారన్నారు జగదీష్ రెడ్డి. 2019 ఎన్నికలలో మీ బట్టలు విప్పి మీరు చెప్పిన మోరిలలో వేసేందుకు ప్రజలే సన్నద్దమవుతున్నారని మంత్రి జగదీష్ రెడ్డి ఘాటుగా వ్యాఖ్యానించారు.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos