‘‘కోమటిరెడ్డి పిల్ల కోతి.. బలుపు చాలా ఎక్కువ’’

minister jagadish reddy fire on mlc komatireddy rajagopal reddy
Highlights

దొంగ కాంటాక్టులతో డబ్బు సంపాదించావ్

కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి ఫైర్ అయ్యారు. నల్లగొండ జిల్లాలో రైతుబంధు కార్యక్రమంలో పాల్గొన్న జగదీష్ రెడ్డి మాట్లాడుతూ కోమటిరెడ్డి రాజగోపాల్ పై నిప్పులు చెరిగారు.  రాష్ట్ర ప్రభఉత్వం ప్రవేశ పెట్టిన రైతుబందు పధకంలో రైతులకు అందిస్తున్న పెట్టుబడి కేవలం భూస్వామ్య పెట్టుబడి దారులకే లాభదాయకంగా ఉందంటూ  శాసనమండలి సభ్యుడు కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర విద్యుత్ మరియు యస్.సి అభివృద్ధి శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి మంది పడ్డారు. అదో పిల్ల కోతి మల్లా దానికి బలుపు ఎక్కువే అని ఘాటుగా విమర్శించారు. దివంగాత ముఖ్యమంత్రి వై.యస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ఆయన కాళ్ళ మీదపడి చేజిక్కించుకున్న దొంగ కాంట్రాక్ట్ లతో సంపాదించుకున్న సంపాదనతో రైతాంగాన్ని అపహాస్యం పాలు చేసే విధంగా మాట్లాడడం ఆయనకే చెల్లిందని మంత్రి జగదీష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

రైతుబందు పధకం ప్రారంభోత్సవంలో బాగంగా ఆయన ఆదివారం రోజున నల్గొండ మండలం కంచనపల్లి గ్రామంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని పెట్టుబడి చెక్కు లతో పాటు,పట్టేదార్ పాస్ బుక్కు లను అంద చేశారు. ఈ సందర్బంగా జరిగిన సభలో మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ “చినుకు పడితే నాగలి బుజానావేసుకొని పొలానికి పోవాల్సిన రైతు అప్పు కోసం పడుతున్న తిప్పలను స్వయంగా రైతు కూడా అయిన ముఖ్యమంత్రి కెసిఆర్ గుర్తించి వ్యవసాయానికి పెట్టుబడినందించేందుకు గాను రైతు బందు పధకం పేరుతొ ఎకరాకు నాలుగు వేలు అందించేందుకు ఉద్దేశించ బడిన పధకం”మాత్రం ఇది అన్నారు.అటువంటి పధకాన్ని తూట్లు పోదిచేవిదంగా మాట్ల్డుతున్న నేతలకు కర్రు కాల్చి వాత పెట్టె సమయం అసన్న మైనదన్నారు.రైతు పట్టే నాగాలికి ఉండాల్సిన కర్రు కొలిమిలో వేడి చేసి కాలిస్తే తప్ప ఇటువంటి వారికి జ్ఞానోదయం కలుగదన్నారు.

బిజెపి నేత మరొక అడుగు ముందుకేసి రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణా రైతాంగానికి అందిస్తున్న పెట్టుబడి సొమ్ముతో రైతులు బీర్లు బిర్యానీలు తింటున్నారని చేసిన ప్రకటన కేంద్రంలో అధికారంలో ఉన్న ఆ పార్టికి రైతుల పట్ల ఉన్న బావనకు అద్దం పడుతుందన్నారు. అటువంటి నేతలను ఏమి చెయ్యాలంటూ మంత్రి జగదీష్ రెడ్డి రైతాంగాన్ని ప్రశ్నించారు. రైతులకోసమే పుట్టుకోచ్చామని, రైతే రాజ్యమని ఓట్ల రోజున చెప్పి అధికారంలోకి వచ్చిన పార్టీలకు ఈ ఆలోచన ఇప్పతివరకు ఎందుకు రాలేదన్నదే తెలంగాణా రైతుల మెదళ్లను తొలుస్తున్న ప్రశ్నఅని,అటువంటి ప్రశ్న కు సమాధానం చెప్పకుండా తిరిగి అదే రైతాంగాన్ని అవమాన పరిచే రీతిలో మాట్లాడడం వారి వివేకానికి అద్దం పడుతోన్దాన్నారు.

మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి రాష్ట్ర ప్రబుత్వం పై చేసిన ఆరోపణలను మంత్రి జగదీష్ రెడ్డి కొట్టి పారేస్తూనే నాలుగేండ్లు నిద్రలోకి పోయిన ఆయనకు ఇప్పుడే మేలుక వచ్చినట్లుందాన్నారు. నాలుగేండ్లుగా కెసిఆర్ ఏమి చేశాడంటూ ఎక్కడో కూర్చొని పత్రికలనడగడడం కాదు దేవరకొండ లాంటి గిరిజన ప్రాంతాలకు వెళ్లి అడిగు చిపుర్లతో స్వాగతం పలికి కల్యాణలక్ష్మి,కెసిఆర్ కిట్,ఆసరా ఫించన్,గురుకులాలకు సన్నబియ్యంతో కూడిన అన్నం,24 గంటల నిరంతర విద్యుత్ ప్రసారం,తాజాగా రాష్ట్ర ప్రబుత్వం ప్రవేశ పెట్టిన రైతుబందు పధకం గురించి ముఖ్యమంత్రి కేసిఆర్ కాదు తెలంగాణా ప్రజలు,రైతంగామే సమగ్రంగా వివరిస్తారని మంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి గా ఉన్న రోజుల్లో మంత్రి పదవులు తప్ప మంచినీళ్ళు అడగలేని కాంగ్రెస్ నేతలు రైతుబందుపధకం పైన అవాకులు చవాకులు పేలడం విద్దురంగాఉందన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యలు బడుగుల లింగయ్య యాదవ్,సీనియర్ టి.అర్.యస్ నాయకులు సునక్రి మల్లేష్ గౌడ్,బోయనపల్లి కృష్ణారెడ్డి, నల్గొండ నియోజకవర్గ టి అర్ యస్ ఇంచార్జ్ కంచర్ల భూపాల్ రెడ్డి,నల్గొండ మార్కెట్ కమిటి చైర్మేన్ కరీం పాషా, మండల ప్రజాపరిషత్ అధ్యక్షరాలు దైదా రజిత,కంచనపల్లి గ్రామ సర్పంచ్ విజయ రెడ్డి,రైతు సమన్వయ సమితి సభ్యురాలు వనపర్తి జ్యోతి,మండల టి.అర్.యస్ పార్టీ అధ్యక్షుడు బకరం వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

loader