రైతు ఆత్మహత్యలకు అసలైన పరిష్కారం ఇదే

రైతు ఆత్మహత్యలకు అసలైన పరిష్కారం ఇదే

తెలంగాణలో రైతు ఆత్మహత్యలకు అసలైన పరిష్కారం రైతు బంధు పథకమే అని తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి చెప్పారు. సూర్యాపేట జిల్లా, ఆత్మకూరు ఎస్ మండలం, గట్టికల్ , ముక్కుడుదేవులపల్లి గ్రామాల్లో ఆయన పర్యటించి రైతులకు చెక్కులను పంపిణీ  చేశారు. ఈ సందర్భంగా జగదీష్ రెడ్డి ఏమన్నారంటే..

రైతు బంధు పథకానికి ప్రజలు నీరాజనాలు  పడుతున్నారు. గ్రామాల్లో  ఎక్కడ చూసిన   ఆనందోత్సాహాలతో రైతులు ఉన్నారు. తెలంగాణా లో నీను  రైతును అని గర్వంగా చెప్పుకుంటున్నారు. చెక్కులు చేతపట్టుకొని రైతులు ఆనందభాష్పాలతో సీఎం కేసీఆర్  కృతజ్ఞతలు తెలుపుతున్న రు. కాంగ్రెస్ వాళ్ళ కళ్ళకు పొరలు వచ్చాయి. రైతు ల సంతోషం వారికి కనబడటం లేదు. వాళ్లకు కంటి పరిక్షలు చేయాల్సిన అవసరం ఉంది. ప్రతిపక్షాలు  రైతు బంధు పథకం పై అడ్డగోలు ఆరోపణలు చేసి చరిత్ర హీనులుగా మిగిలిపోయారు.

అప్పులు చేయకుండా వ్యవసాయం చేసే రోజులు తెలంగాణా లో వొచ్చాయి. తెలంగాణా లో అమలు చేస్తున్న రైతు బంధు పథకాన్ని దేశంలోని ప్రతి రైతు కోరుకుంటున్నాడు. ఆర్ధిక వేత్తలు, వ్యవసాయ శాస్త్రవేత్తలు పెట్టుబడి పథకాన్నికొనియాడుతున్నారు. పెట్టుబడి పథకం  రైతుల ఆత్మహత్యలకు  సరైన పరిష్కారం అని   సీఎం కేసీఆర్  భావించారు. తెరాస ప్రభుత్వం రైతు ప్రభుత్వం.. రైతులకు ఎం చేయడానికి అయిన సీఎం కేసీఆర్ సిద్ధంగా ఉన్నారు.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos

MORE FROM Telangana

Next page