ఆయన తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి. పేరు జగదీష్ రెడ్డి. ఆయన ఇవాళ సూర్యాపేట లో ప్రతిపక్షాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఎంత తీవ్ర స్థాయిలో అంటే.. లెక్కలేనంత తీవ్రంగా. మరి ఆ మంత్రి అంత తీవ్రంగా ఎందుకు విరుచుకుపడ్డారనుకుంటున్నారు? చదవండి. సూర్యాపేట మండలం పిన్నాయిపాళెం గ్రామంలో రైతులకు చెక్కులను పంపిణీ చేశారు మంత్రి జగదీష్ రెడ్డి. అనంతరం మీడియాతో మాట్లాడారు.

రైతు బంధు  పథకాన్ని విమర్శిస్తున్న వారిని, విమర్శిస్తున్న పార్టీలను  చెప్పులతో కొట్టాలి. రైతు బంధు చెక్కులతో రైతులు  బీర్లు తాగుతున్నారు అని విమర్శిస్తున్న కాంగ్రెస్ వారిని  ఊర్లల్లో తరిమి తరిమి కొట్టాలి. జైపాల్  రెడ్డి కూడా  రైతు బంధు పథకం పై నిర్లజ్జగా, నిస్దిగ్గుగా  విమర్శలు చేస్తున్నాడు. కాంగ్రెస్ వాళ్లు గ్రామాలలోకి వొచ్చి చూడండి. కళ్ళున్న కబొదిల్లాగా మారారు. కాంగ్రెస్ పార్టీని పాతర పెట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. జానా రెడ్డి సొంత నియోజకవర్గం లో మంచి నీళ్ళు ఇవ్వలేదు. ఇప్పుడు నీతులు చెప్తున్నారు. గ్రామాల్లోకి వొచ్చే కాంగ్రెస్ వారిని ప్రజలు  అడుగడుగునా నిలదీయాలి. ఎన్నికలో చెప్పిన అన్ని హామీలను  మూడేళ్ళలో  అమలు ఘనత సీఎం కేసీఆర్ ది. కళ్యాణ లక్ష్మీ పథకంతో అప్పులు చేయకుండా ఆడపిల్లల  పెళ్లిళ్లు చేస్తూ తల్లిదండ్రులు సంతోషంగా ఉన్నారు. ఎవ్వరు అడగకముందే  సీఎం కేసీఆర్ స్వయంగా కల్యాణ లక్ష్మీ పథకానికి శ్రీకారం చుట్టారు. సమైక్య పాలకులు గ్రామాలను, వ్యవసాయాన్ని అస్తవ్యస్తం చేశారు.

కరంట్ ను కావాల్సినంత అందిస్తూ వ్యవసాయ రంగంలో మార్పులు తీసుకొచ్చారు సీఎం కేసీఆర్. తెలంగాణా రైతులు దేశానికే ఆదర్శంగా నిలిచారు...తెలంగాణా రైతులు  అన్నిట్లో ముందంజలో నిలిచారు. ధైర్యంగా , భరోసాగా  రైతులు వ్యవసాయం చేసుకునే   రోజులు తెలంగాణా లో  వొచ్చాయి. భూ రికార్డుల ప్రక్షాళనతో  రైతులు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలకు పరిష్కారం   లభించింది. గ్రామాల్లో  చిన్న చిన్న గొడవలు కూడా   లేవు. పల్లెల్లో ప్రశాంత వాతావరణం నెలకొన్నది. పంటలకు మద్దతు ధర కోసం రైతు సమన్వయ సమితి లను   సీఎం కేసీఆర్ ఏర్పాటు చేశారు. వ్యవసాయం బ్రతికించుకోవడానికి ఏం చేయడానికైనా సీఎం కేసీఆర్ సిద్ధంగా ఉన్నారు.