బాసర: బాసర సరస్వతి ఆలయంలో అమ్మవారి కిరీటంలో వజ్రం మాయం కావడంపై తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి విచారణకు ఆదేశాలు జారీ చేశారు.

ఈ ఘటనపై విచారణ జరిపి నివేదికను సమర్పించాలని దేవాదాయ శాఖ కమిషనర్‌ను మంత్రి  ఆదేశించారు. బాసర అమ్మవారి కిరీటంలో వజ్రం గల్లంతైన విషయమై మీడియాలో వార్తలు వచ్చిన నేపథ్యంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సోమవారం నాడు  ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.

ఈ వజ్రం మాయమైన ఘటనపై బాధ్యులపైచర్యలు తీసుకోవాలని కూడ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దేవాదాయశాఖ కమిషనర్‌ను ఆదేశించారు. ఈ విచారణను వేగంగా పూర్తి చేయాలని ఆయన కోరారు.బాసర ఆలయంలో చోటు చేసుకొంటున్న ఘటనలు వివాదానికి కారణంగా మారుతున్నాయి.

సంబంధిత వార్తలు

బాసర అమ్మవారి కిరీటంలో వజ్రం మాయం