ఆదిలాబాద్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని బాసర సరస్వతి అమ్మవారి కిరీటంలో ఉన్న వజ్రం కన్పించకుండా పోయింది. ఈ విషయాన్ని అధికారులు గోప్యంగా ఉంచారు.ఈ విషయమై ఈవో విచారణ చేస్తున్నట్టు సమాచారం.

2006లో హైద్రాబాద్‌కు చెందిన భక్తుడు కిరీటంలో వజ్రాన్ని బహుకరించాడు. గత ఏడాదిలో సరస్వతి అమ్మవారి ఆలయంలో విగ్రహం కూడ వేరే ప్రాంతానికి కూడ తరలించిన విషయం వివాదాస్పదమైన విషయం తెలిసిందే.

అమ్మవారికి పూజ చేసే సమయంలో  కిరీటంలో ఉన్న వజ్రం కిందపడిపోయి ఉండవచ్చని పూజారులు అనుమానిస్తున్నారు. బాసర ఆలయంలో  రెండు వర్గాలుగా విడిపోయారు.  ఈ వర్గాల మధ్య పోరు కారణంగానే  ఈ పరిస్థితి చోటు చేసుకొందనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.

ఈ వజ్రం కన్పించకుండా పోయిన చాలా కాలం అవుతోందనే  అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే రెండు వర్గాల మధ్య గొడవ కారణంగానే ఈ విషయం వెలుగు చూసినట్టుగా  సమాచారం. ఈ విషయమై ఈవో అంతర్గతంగా విచారణ చేస్తున్నారని తెలుస్తోంది.