రోడ్డ ప్రమాదంలో గాయపడిన వారికి మంత్రి హరీష్ పరామర్శ

minister harish rao visits yashoda hospital
Highlights

ఓదార్చిన మంత్రి హరీష్

సిద్దిపేట జిల్లా గజ్వేల్‌మండలం రిమ్మనగూడలో వద్ద శనివారం జరిగిన ప్రమాదంలో‌ గాయపడిన క్షతగాత్రులకు  సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో వైద్యం నడుస్తోంది. చికిత్స పొందుతున్న వారిని మంత్రి హరీష్ రావు పరామర్శించారు. బాధితులను ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని మంత్రి హరీష్ రావు హామీ ఇచ్చారు. క్షతగాత్రులకు అందుతున్న వైద్యంపై  , వైద్య నిపునులను వివరాలు అడిగి తెలుసుకున్నారు మంత్రి హరీష్ రావు.

ప్రభుత్వమే మొత్తం వైద్య ఖర్చులు భరిస్తుందని, అత్యత్తమ వైద్య చికిత్స గాయపడిన వారికి అందించాలని  వైద్యులకు మంత్రి సూచించారు.

 

మరోవైపు గాంధీ ఆస్పత్రిలో ప్రజ్ఞాపూర్ రోడ్డు ప్రమాద బాదితులను రవాణా మంత్రి మహేందర్ రెడ్డి పరామర్శించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ చైర్మన్ సత్యనారాయణ, ఎండీ రమణారావు పాల్గొన్నారు. ఆస్పత్రి లో ని అత్యవసర చికిత్స పొందుతున్న బాదితులను,వారి కుటుంబాలను పలకరించి పరిస్థితి తెలుసుకున్నారు మంత్రి పట్నం. పరిస్థితి విశమంగా ఉన్న ఇద్దరు చిన్నారులను తక్షణం యశోద ఆస్పత్రికి తరలించి  మెరుగైన 
చికిత్స అందించాలని ఎండీ రమణారావు ను ఆదేశించారు మంత్రి. ఈ ఘటన దురదృష్టం, బాధాకరం అని ఆవేదన వ్యక్తం చేశారు పట్నం. మృతుల కుటుంబానికి ప్రగాడ సానుభూతి తెలిపారు. 

మృతుల కుటుంబానికి ప్రభుత్వం  తరపున రూ. 5 లక్షలు, ఆర్టీసీ తరపున మరో రూ. 2 లక్షలు  అందిస్తామని ప్రకటించారు. ప్రమాదాలు జరగకుండా చూడాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. 

loader