Asianet News TeluguAsianet News Telugu

చంద్రబాబు, షర్మిల సపోర్ట్ కాంగ్రెస్‌కే .. తెలంగాణ ద్రోహులతో రేవంత్ ముఠా : హరీశ్‌రావు వ్యాఖ్యలు

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు మంత్రి హరీశ్ రావు . కేసీఆర్‌ను క్రిమినల్ అంటున్న రేవంత్ రెడ్డే ఓటుకు నోటు కేసులో దొరికిన అసలైన క్రిమినల్ అని మంత్రి దుయ్యబట్టారు. రేవంత్ టికెట్లు అమ్ముకుంటున్నాడని.. కాంగ్రెస్ కార్యకర్తలే అంటున్నారని, అధికారంలోకి వస్తే తెలంగాణనే అమ్మేస్తారని హరీశ్ రావు ధ్వజమెత్తారు. 

minister harish rao slams tpcc chief revanth reddy ksp
Author
First Published Nov 3, 2023, 3:08 PM IST

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు మంత్రి హరీశ్ రావు. శుక్రవారం సంగారెడ్డిలో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ.. రేవంత్ రెడ్డి తెలంగాణ వ్యతిరేకి అని వ్యాఖ్యానించారు. తెలంగాణ వ్యతిరేక ముఠా అంతా ఒక్కటవుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్‌ను క్రిమినల్ అంటున్న రేవంత్ రెడ్డే ఓటుకు నోటు కేసులో దొరికిన అసలైన క్రిమినల్ అని మంత్రి దుయ్యబట్టారు.

రేవంత్ టికెట్లు అమ్ముకుంటున్నాడని.. కాంగ్రెస్ కార్యకర్తలే అంటున్నారని, అధికారంలోకి వస్తే తెలంగాణనే అమ్మేస్తారని హరీశ్ రావు ధ్వజమెత్తారు. సంగారెడ్డిలో గులాబీ జెండా ఎగిరితేనే అభివృద్ధి పరుగులు పెడుతుందని ఆయన పేర్కొన్నారు. కేసీఆర్ హయాంలో తాగునీటికీ, కరెంట్‌కూ కొరత లేదని, కర్ఫ్యూలు లేవని హరీశ్ రావు గుర్తుచేశారు. 

ALso Read: నేను పప్పు అయితే... అతను గన్నేరు పప్పు:కేటీఆర్‌కు రేవంత్ కౌంటర్

లోలోపల చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ కి సపోర్ట్ చేస్తున్నారని మంత్రి ఆరోపించారు. రేవంత్ రెడ్డే అసలు నియంత, క్రిమినల్ బుద్ధి అంటూ హరీశ్ రావు వ్యాఖ్యానించారు. తెలంగాణను వ్యతిరేకించిన వైఎస్సార్ కూతురు కూడా కాంగ్రెస్‌కు సపోర్ట్ చేస్తున్నారని మంత్రి చురకలంటించారు. తెలంగాణ ద్రోహులతో రేవంత్ రెడ్డి స్నేహం చేస్తున్నారని.. జగ్గారెడ్డి తెలంగాణ వద్దన్నారని హరీశ్ రావు గుర్తుచేశారు. తెలంగాణ వద్దన్న చంద్రబాబు, వైఎస్సార్.. రేవంత్ రెడ్డికి నచ్చుతారని మంత్రి ఎద్దేవా చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios