Asianet News TeluguAsianet News Telugu

తప్పుడు ఆరోపణలతో సానుభూతికి యత్నం.. హుజురాబాద్ ప్రజలు లొంగరు: ఈటలపై హరీశ్‌ వ్యాఖ్యలు

మాజీ మంత్రి ఈటల రాజేందర్‌పై (etela rajender) మండిపడ్డారు మంత్రి హరీశ్ రావ్ (harish rao). బీజేపీలో (bjp) చేరిన తర్వాత ఈటల రాజేందర్ అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. టీఆర్ఎస్‌ (trs) పార్టీ‌పై తప్పుడు ఆరోపణలు చేస్తూ సానుభూతి పొందే ప్రయత్నం చేస్తున్నారని హరీశ్ రావ్ ఎద్దేవా చేశారు.

minister harish rao slams bjp leader etela rajender over huzurabad by poll
Author
Huzurabad, First Published Oct 16, 2021, 9:29 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

మాజీ మంత్రి ఈటల రాజేందర్‌పై (etela rajender) మండిపడ్డారు మంత్రి హరీశ్ రావ్ (harish rao). బీజేపీలో (bjp) చేరిన తర్వాత ఈటల రాజేందర్ అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. టీఆర్ఎస్‌ (trs) పార్టీ‌పై తప్పుడు ఆరోపణలు చేస్తూ సానుభూతి పొందే ప్రయత్నం చేస్తున్నారని హరీశ్ రావ్ ఎద్దేవా చేశారు. కమలాపూర్‌లో ఒక అటోడ్రైవర్ ఆక్సిడెంట్‌లో చనిపోతే విప్ బాల్క సుమన్ (balka suman) కారు ఆక్సిడెంట్ చేసిందని ఐదు గంటలు ధర్నా చేశారని దుయ్యబట్టారు. చివరికి పోలీసుల విచారణలో ఆక్సిడెంట్ చేసిన కారు విశ్వనాథ్ ఆనంద్ అనే బండి సంజయ్ అనుచరుడు అని హరీశ్ రావు ఆరోపించారు. 

రాష్ట్ర ప్రభుత్వం గ్యాస్ ధర మీద 291 రూపాయలు (gas price) ట్యాక్స్ వేస్తుందని అబద్ధపు ప్రచారం చేస్తున్నారని.. అంత ట్యాక్స్ వేస్తే స్థానిక అంబేడ్కర్ చౌరస్తా వద్దకు రమ్మంటే రాలేదని మంత్రి ధ్వజమెత్తారు. ఒక ఆర్థిక మంత్రిగా పనిచేసిన వ్యక్తికి రాష్ట్ర ప్రభుత్వ పన్ను లేదని తెలియదా.. అని హరీశ్ ప్రశ్నించారు. పావలా వడ్డీ రుణాలకు సంబంధించి దొంగ చెక్కులు ఇచ్చినట్లు చెబుతున్నారని.. బతుకమ్మ పండుగ ముందే పావలా రుణాలకు సంభందించి అందరికీ డబ్బులు వచ్చాయని మంత్రి స్పష్టం చేశారు. 

ALso Read:Huzurabad ByPoll: ఈటల‌కు హరీశ్ రావు సవాల్... రుజువు చేస్తే రాజీనామా చేస్తా: ప్లేస్, టైం డిసైడ్ చేయ్

ఈటల రాజేందర్ అవగాహనతో మాట్లాడాలని.. టీఆర్ఎస్ డబ్బులు పంచుతూ ప్రలోభాలకు గురి చేస్తోందని అబద్ధపు ప్రచారం చేస్తున్నారని హరీశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరు సార్లు గెలిపించిన ప్రజలను ప్రలోభాలకు లోంగుతారని వారిని కించపరిచేలా మాట్లాడుతున్నారని.. సోషల్ మీడియాలో వచ్చే అబద్ధపు ప్రచారాలను హుజూరాబాద్ ప్రజలు నమ్మొద్దని హరీశ్ రావు విజ్ఞప్తి చేశారు. తాము ఢిల్లీకి గులాములం కాదని.. తెలంగాణ ప్రజలకే గులాములమని స్పష్టం చేశారు. ఈటల రాజేందర్ గెలిస్తే బీజేపీకే లాభమని.. టీఆర్ఎస్ గెలిస్తే హుజూరాబాద్ ప్రజలకు లాభమని ఆయన అభివర్ణించారు. 

ఈటల రాజేందర్ సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారని.. సంక్షేమ పథకాలు అందుకున్న వారిని అడిగితే కేసీఆర్‌కు మానవత్వం ఉందా లేదా అని చెప్తారంటూ దుయ్యబట్టారు. బిజెపిలో చేరిన రాజేందర్ తనను చూసి ఓటు వేయమంటున్నారని.. గ్యాస్ ధరలు పెంచింది బీజేపీయేనా కాదా అని హరీశ్ ప్రశ్నించారు. బిజెపి జెండాను ఎత్తుకున్నప్పుడు బిజెపి జెండాను ఎత్తుకోవాలి కదా అని ఆయన చురకలు వేశారు. గత పది రోజుల్లో పెట్రోల్ డీజిల్ ధరలు (petrol diesel price) పెరిగింది వాస్తవం కదా అని నిలదీశారు. బిజెపి ప్రభుత్వ సంస్థలను అమ్మే విధానాన్ని ఈటల రాజేందర్ సమర్థిస్తారా సూటిగా సమాధానం చెప్పాలని హరీశ్ రావు ప్రశ్నించారు. 

రైతు వ్యతిరేక చట్టాలను తెచ్చిన బిజెపికి మీరు ఓటు వేయమంటారా..  బిజెపి అనే బురదలో దిగినప్పుడు వీటన్నింటికీ మీరు సమాధానం చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు. ధరలు తగ్గాలంటే రాజేందర్ బిజెపిని చిత్తు చిత్తుగా ఓడించాలని హరీశ్ రావు పిలుపునిచ్చారు. బిజెపి పాలిత రాష్ట్రాలలో కరెంట్ కోతలు ఉంటే తెలంగాణ అవసరాలకు పోను ఇతర రాష్ట్రాలకు అమ్ముతున్న రాష్ట్రం తెలంగాణయేనన్నారు. గతం లో వినోద్ ఎంపీగా ఉన్నప్పుడు హుజూరాబాద్ రైల్వే లైన్ (huzurabad) కోసం నిధులు మంజూరు చేపిస్తే బండి సంజయ్ (bandi sanjay) ఆ ప్రతిపాదనను అటకెక్కించారని హరీశ్ ఆరోపించారు. 

హుజూరాబాద్‌లో అభివృద్ధికి , అరాచకానికి పోటీ జరుగుతోందని.. ఇప్పుడు దళిత బందు నా వల్ల వచ్చింది అంటున్న ఈటల రాజేందర్ గతం లో ఇచ్చిన పథకాలు ఎవరి వల్ల వచ్చాయని మంత్రి ప్రశ్నించారు. ఏడేళ్ల బిజెపి పరిపాలనకు ఏడేళ్ల టీఆర్ఎస్ పార్టీ పాలనను రెఫరెండం గా తీసుకుందామన్నారు. రాబోయే రోజుల్లో కూడా ఇటువంటి అబద్ధపు ప్రచారాలు చేస్తారు కాబట్టి హుజూరాబాద్ ప్రజలు నమ్మవద్దని హరీశ్ రావు విజ్ఞప్తి చేశారు. 

 

"

Follow Us:
Download App:
  • android
  • ios