రేవంత్ రెడ్డి చేతుల్లోకి తెలంగాణ వెళ్లకూడదు : హరీశ్‌రావు సంచలన వ్యాఖ్యలు
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు మంత్రి హరీశ్ రావు. రేవంత్ లాంటి వ్యక్తి చేతుల్లోకి పోతే రాష్ట్రం ఏమైపోతుందని ఆయన ప్రశ్నించారు . రేవంత్ రెడ్డికి వ్యవసాయంపై కనీస అవగాహన లేదని.. అందుకే కరెంట్, రైతుబంధు, ధరణి గురించి నోటికొచ్చినట్లుగా మాట్లాడుతున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు మంత్రి హరీశ్ రావు. ఆదివావారం తెలంగాణ భవన్‌లో పలువురు నేతలు , కార్యకర్తలు బీఆర్ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ.. రేవంత్ రెడ్డికి హార్స్ పవర్ అంటే ఏంటో తెలుసా అని ప్రశ్నించారు. ఉచిత కరెంట్‌ను ఉత్త కరెంట్ చేసింది కాంగ్రెస్ కాదా అని హరీశ్‌రావు నిలదీశారు. ఇలాంటి కాంగ్రెస్ మనకు అవసరమా అని మంత్రి ప్రశ్నించారు. కాంగ్రెస్ చేతుల్లోకి రాష్ట్రం వెళ్లడం మంచిది కాదని ఆయన హెచ్చరించారు.
రైతుబంధు ఇస్తే బిచ్చం వేస్తున్నారని రేవంత్ అంటున్నారని హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ లాంటి వ్యక్తి చేతుల్లోకి పోతే రాష్ట్రం ఏమైపోతుందని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ ఒక ముఠా చేతుల్లోకి వెళ్లిందని.. కేసీఆర్ కృషి వల్లనే తెలంగాణలో భూముల విలువ పెరిగిందని హరీశ్ రావు తెలిపారు. కర్ణాటకలో 2 , 3 గంటల కరెంట్ కూడా ఇవ్వడం లేదని మంత్రి చెప్పారు. ధాన్యం ఉత్పత్తిలో దేశంలోనే తెలంగాణను కేసీఆర్ నెంబర్ వన్ చేశారని హరీశ్‌రావు ప్రశంసించారు.
Also Read: కేసీఆర్‌కు ఈసారి కష్టమేనా.. గజ్వేల్‌లో 157 నామినేషన్లు, పోటీదారులంతా బీఆర్ఎస్ బాధితులే
రేవంత్ రెడ్డికి వ్యవసాయంపై కనీస అవగాహన లేదని.. అందుకే కరెంట్, రైతుబంధు, ధరణి గురించి నోటికొచ్చినట్లుగా మాట్లాడుతున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. కరెంట్ విషయంలో కాంగ్రెస్ పార్టీ తప్పులు మీద తప్పులు చేస్తోందని హరీశ్ దుయ్యబట్టారు. కాంగ్రెస్ పాలనలో కాలిపోయిన మోటార్లు, పేలిపోయిన ట్రాన్స్‌ఫార్మర్లే దర్శనమిచ్చేవని మంత్రి ఎద్దేవా చేశారు. తెలంగాణలో 24 గంటల కరెంట్ ఇస్తుంటే కర్ణాటకలో 5 గంటల కరెంట్ ఇస్తున్నామని డీకే శివకుమార్ గొప్పలు చెబుతున్నారని హరీశ్ చురకలంటించారు.