Asianet News TeluguAsianet News Telugu

వ్యాక్సిన్ పంపిణీలో తెలంగాణ ముందజ.. బూస్టర్ డోస్ పంపిణీని ప్రారంభించిన మంత్రి హరీష్ రావు

తెలంగాణలో బూస్టర్ డోస్ పంపిణీ కార్యక్రమాన్ని ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు (Harish Rao) ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బూస్టర్ డోస్‌‌పై అనుమానాలొద్దని అన్నారు. బూస్టర్ డోస్‌తో ప్రయోజనాలు ఉన్నాయని.. అర్హులైన అందరూ బూస్టర్ డోసు (booster dose) తీసుకోవాలని కోరారు.

Minister Harish Rao launches booster dose Vaccination in Telangana
Author
Hyderabad, First Published Jan 10, 2022, 11:58 AM IST

తెలంగాణలో బూస్టర్ డోస్ పంపిణీ కార్యక్రమాన్ని ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు (Harish Rao) ప్రారంభించారు. హైదరాబాద్‌ చార్మినార్ యునానీ ఆస్పత్రి‌లో (Unani Hospital Charminar) జరిగిన కార్యక్రమంలోనే మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి హరీష్ రావుతో పాటుగా ఎంఐఎం ఎమ్మెల్యేలు అక్బరుద్దీన్ ఒవైసీ, అహ్మద్ బలాలా, ముంతాజ్ అహ్మద్ ఖాన్‌, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఫ్రంట్ లైన్ వర్కర్లతో పాటుగా ఎమ్మెల్యేలు ముంతాజ్ అంజద్ ఖాన్, అహ్మద్ బలాలా బూస్టర్ డోస్ తీసున్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. బూస్టర్ డోస్‌‌పై అనుమానాలొద్దని అన్నారు. బూస్టర్ డోస్‌తో ప్రయోజనాలు ఉన్నాయని.. అర్హులైన అందరూ బూస్టర్ డోసు (booster) తీసుకోవాలని కోరారు. అమెరికా బ్రిటన్ వంటి దేశాల్లో బూస్టర్ డోస్ తీసుకుంటున్నారని అన్నారు.  

రాష్ట్రంలో మొదటి డోస్ 102 శాతం, రెండో డోసు 78 శాతం వ్యాక్సినేషన్ పూర్తి అయిందని చెప్పారు. వ్యాక్సిన్ పంపిణీలో తెలంగాణ ముందజలో ఉందన్నారు.  రాష్ట్రంలో వ్యాక్సినేషన్‌ను 100 శాతం పూర్తిచేసే విధంగా ముందుకు సాగుతున్నామని చెప్పారు. కరోనా నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి మాస్క్, వ్యాక్సిన్ తప్పనిసరి అని అన్నారు. బూస్టర్‌ డోస్‌ను ఫ్రంట్ లైన్ వర్కర్లైన హెల్త్, పోలీసు సిబ్బందికి ఇస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో 6.60 లక్షల ఫ్రంట్ లైన్ వర్కర్లను గుర్తించామని.. వారికి బూస్టర్‌ డోసు ఇవ్వనున్నట్టుగా  తెలిపారు. 60 ఏళ్లకు పైబడి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు కూడా బూస్టర్ డోస్ తీసుకోవాలని అన్నారు. ఆరోగ్యశాఖ సిబ్బందికి ప్రజాప్రతినిధులు సహకరించాలని కోరారు.

యునానీ ఆస్పత్రిలో సమస్యలపై చర్చించామని.. త్వరలోనే వాటిని పరిష్కరిస్తామని మంత్రి హరీష్ తెలిపారు. ఆస్పత్రిలో ఖాళీగా ఉన్న పోస్టులన్నీ త్వరలోనే భర్తీ చేస్తామని చెప్పారు. రెండు మూడు రోజుల్లోనే నోటిఫికేషన్ ఇస్తామని తెలిపారు. 

ఇక, దేశంలో ఫ్రంట్ లైన్ వర్కర్లు, 60 ఏల్ల పైబడి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి నేటి నుంచి బూస్టర్ డోసు వేస్తున్నారు. గతంలో రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నవారికి.. అదే రిజిస్ట్రేషన్‌తో వ్యాక్సిన్ తీసుకునే వెసులుబాటు కల్పించారు. గతంలో రెండు డోసుల స‌మ‌యంలో ఏ వ్యాక్సిన్ వేసుకున్నారో ఇప్పుడు కూడా అదే రకం వ్యాక్సిన్ వేసుకోవాల్సి ఉంటుంది. అయితే రెండో డోసు పూర్త‌యిన 90 రోజులు లేదా 39 వారాలు నిండిన త‌రువాతే ఈ ప్రికాష‌న‌రీ డోసు వేసుకోవాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం మార్గ‌ద‌ర్శ‌కాలు జారీ చేసింది. 

ఇక, తెలంగాణలో మొత్తం 41.60 లక్షల మంది వృద్దులు ఉన్నారని.. వీరిలో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న 8.32 లక్షల మంది బూస్టర్ డోస్ తీసుకోవడానికి అర్హులని అధికారులు అంచనా వేశారు. వీరికి బూస్టర్ డోస్ అందిచండానికి ఏర్పాట్లు చేశారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios