Asianet News TeluguAsianet News Telugu

మీ ఓటు ఎటువైపు... ఈటల కుట్టు మిషన్లకా... కేసీఆర్ కళ్యాణ లక్ష్మికా?: హరీష్ రావు (వీడియో)

హుజూరాబాద్ నియోజకవర్గ పరిధిలోని దమ్మక్కపేట గ్రామంలో యాదవ భవన నిర్మాణ పనులకు ఆర్థిక మంత్రి హరీశ్ రావు శంకుస్థాపన చేశారు.

Minister Harish Rao Laid Foundation Stone To Yadav Community Building in Huzurabad
Author
Huzurabad, First Published Sep 1, 2021, 2:22 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

హుజురాబాద్: దేశంలో‌ వ్యవసాయం చేసే రైతుకు సాయం చేసిన ఏకైక సీఎం కేసీఆరే అని ఆర్థిక మంత్రి హరీశ్ రావు అన్నారు. నీటి పన్ను, భూమి శిస్తు రద్దు చేసి చివరకు రైతుకే పన్ను కడుతున్న ఏకైక రాష్ట్రం తెలంగాణే అని అన్నారు. రైతులకు భరోసా ఇచ్చింది టీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆరే అని హరీష్ పేర్కొన్నారు. 

హుజూరాబాద్ నియోజకవర్గ పరిధిలోని దమ్మక్కపేట గ్రామంలో యాదవ భవన నిర్మాణ పనులకు మంత్రి హరీశ్ రావు  శంకుస్థాపన చేశారు. ఆ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ... బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ హయాంలో‌ ట్రాన్స్‌ఫార్మర్లు, మోటార్లు ‌కాలిపోయి రైతులు ఇబ్బందులు పడే పరిస్థితి వుండేదన్నారు. 

కాళేశ్వరం కట్టక ముందు రైతులు‌ సాగు నీటి‌విడుదల‌ కోసం ధర్నాలు చేసే దుస్థితి వుండేదని... కానీ కాళేశ్వరం పూర్తయ్యాక కాలువల‌నిండా నీరు ప్రవహిస్తూ పంటలకు పుష్కలంగా అందుతున్నాయన్నారు. ఇంక నీళ్లు వద్దని రైతులు ‌చెప్పే పరిస్థితి వచ్చిందన్నారు. కాలంతో పని లేకుండా రెండు ‌పంటలకు నీరు ఇస్తున్నామన్నారు. 

''కరోనా కష్టకాలంలోను రైతులకు రైతు బంధు ఇచ్చాం. రూ.25వేల‌ లోపు రుణాలు మాఫీ చేశాం. ఇప్పుడు రూ.50‌వేల‌లోపు రుణాలు మాఫీ చేస్తున్నాం. వచ్చే ఏడాది లక్ష రూపాయల లోపు రైతుల రుణాలన్నీ వడ్డీతో ‌సహా మాఫీ చేస్తాం'' అని మంత్రి తెలిపారు. 

''కరోనా కాలంలో ప్రజలకు బియ్యం, పప్పులు వంటి వాటి పంపిణీ కోసం రూ.2,500‌కోట్లు... కరోనా మందులు, ఆక్సిజన్ వంటి వాటి‌కోసం వేయి కోట్లు ఖర్చు చేశాం. అయినప్పటికి ఇతర సంక్షేమ కార్యక్రమాలకు కూడా ఎలాంటి ఆటంకం లేకుండా డబ్బులిచ్చాం'' అన్నారు.  

వీడియో

''హుజూరాబాద్ ప్రజలు ఇళ్లు అడుగుతున్నారు. మంత్రిగా ఈటల నిర్లక్ష్యం వల్ల ఇక్కడ ఇళ్లు పూర్తి కాలేదు. మంత్రులకు సీఎం కేసీఆర్ 4 వేల ఇళ్లు మంజూరు చేశారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి మంత్రిగా 5 వేల ఇళ్లు కట్టారు. నేను 3600 ఇళ్లు కట్టాను. శ్రీనివాస్ గౌడ్ 3300‌ఇళ్లు‌ కట్టారు. మీ పక్క నియోజకవర్గ ఎమ్మెల్యే ధర్మారెడ్డి 850‌ఇళ్లు కట్టారు. ఇళ్లు కట్టించని మంత్రి రాజేందర్ ఒక్కరే'' అని ఆరోపించారు. 

''మీకు ఇళ్లు తప్పకుండా కట్టిస్తాం. సొంత జాగా ఉన్న వాళ్లకు కట్టిస్తాం. కట్టిన ఇళ్లను,‌ఇళ్లు లేక కిరాయికి ఉండే వారికి ఇస్తాం. మీరు ఆలోచించాలి. మంత్రిగా ఒక్క ఇళ్లు కట్టని ఈటల రాదేందర్, ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఏ పని అయినా చేస్తాడా..? ఓ వ్యక్తి లాభం కావాలా... హుజూరాబాద్ ప్రజల‌ లాభం కావాలా? మీ ఓటు ఎటు వైపు? ఈటల పంచే బొట్టు బిల్లకా...కేసీఆరే ఇచ్చే రూ.2016 ఆసరా పెన్షన్ కా.. ? 60 రూపాయల గడియారానికా.. కేసీఆర్ కిట్‌కా. ? కుట్టు మిషన్లకా... కళ్యాణ లక్ష్మికా....?కుంకుమ భరిణికా...రైతు బంధుకా..?  సెల్ ఫోన్లకా....రైతు బీమాకా..?'' అని ప్రశ్నించారు. 

read more  దళితబంధు: మరో నాలుగు మండలాలు ఎంపిక చేసిన కేసీఆర్ సర్కార్

''మేం కాళేశ్వరం ప్రాజెక్టు‌ కడితే బీజేపీ వాళ్లు బీఎస్ఎన్ఎల్, రైల్వే స్టేషన్లు, నౌకాశ్రయాలు, ప్రభుత్వ రంగ‌సంస్థలు అమ్మేస్తున్నారు. నౌకర్లు ఊడగొడుతున్నారు. బీఎస్ఎన్ఎల్ వంటి‌ సంస్థల్ని అమ్మేస్తూ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్లు ఊడగొడుతున్నారు. గ్యాస్, పెట్రోల్,  డిజీల్ ధరలు పెంచుతున్నారు. గ్యాస్ ధర 950 రూపాయలు ‌చేసి ‌సబ్సిడీని రూ.250‌ నుండి‌ రూ.40కి‌ తగ్గించారు. రైతులకు కేసీఆర్ రైతు బంధు ఎకరానికి పది వేలు ఇస్తే...బీజేపీ పెట్రోల్, డిజిల్ ధర పెంచింది'' అని హరీష్ మండిపడ్డారు.

''హుజూరాబాద్ టౌన్ లో‌‌‌ వోల్టేజ్ సమస్య ఉందని చెబుతున్నారు. అందుకే కోటీ 50‌లక్షలతో కొత్త‌ సబ్ స్టేషను మంజూరు చేయిస్తున్నా. బొర్లపల్లి రోడ్ బాగా లేదన్నారు. మూడు కోట్లతో రోడ్ పనులకు మంజూరు చేస్తున్నాం. నర్సింగాపూర్ కు రోడ్ కావాలని రైతులు అడిగారు. బ్రిడ్జి అండ్ రోడ్ కోసం కోటీ 70 లక్షలు మంజూరు చేస్తున్నాం'' అని మంత్రి ప్రకటించారు. 

 
 

Follow Us:
Download App:
  • android
  • ios