హైదరాబాద్‌లోని నీలోఫర్ ఆస్పత్రిలో (Niloufer Hospital) నూతనంగా ఏర్పాటు చేసిన 100 పడకల ఐసీయూ యూనిట్‌ను తెలంగాణ వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు (Harish Rao) శనివారం ప్రారంభించారు. వచ్చే ఏడాది నుంచి రాష్ట్రంలో మరో 8 మెడికల్ కాలేజ్‌లు అందుబాటులోకి రానున్నాయని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు.

హైదరాబాద్‌లోని నీలోఫర్ ఆస్పత్రిలో (Niloufer Hospital) నూతనంగా ఏర్పాటు చేసిన 100 పడకల ఐసీయూ యూనిట్‌ను తెలంగాణ వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు (Harish Rao) శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రభుత్వ ఆస్పత్రలు బలోపేతానికి హైసియా, నిర్మాణ్, ఓపెన్‌టెక్ట్స్ సంయుక్తంగా రూ. 18 కోట్ల నిధులు అందించాయని అన్నారు. రూ. 10 వేల కోట్లతో ఆరోగ్యశాఖను మరింత వృద్దిలోకి తీసుకొస్తామని చెప్పారు. ప్రభుత్వ వైద్యంపై ప్రజల్లో విశ్వాసం పెంచాలి అన్నారు. 

టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రభుత్వ ఆస్పత్రుల్లో డెలివరీల రేట్‌ను 50 శాతానికి పెంచినట్టుగా చెప్పారు. తల్లి, పిల్లల మరణాలు గణనీయంగా తగ్గాయని తెలిపారు. హైదరాబాద్ నగరం నలువైపులా నాలుగు మెడికల్ టవర్లు తీసుకురావాలని కృషి చేస్తున్నామని చెప్పారు. వచ్చే ఏడాది నుంచి రాష్ట్రంలో మరో 8 మెడికల్ కాలేజ్‌లు అందుబాటులోకి రానున్నాయని తెలిపారు. రూ. 33 కోట్లతో నీలోఫర్‌లో మరో 800 పడకలు అందుబాటులోకి తెస్తామని హామీ ఇచ్చారు. 

థర్డ్‌వేవ్ వస్తే సన్నద్ధంగా ఉండేందుకు రూ. 133 కోట్లు కేటాయించామని వెల్లడించారు. చిన్న పిల్లల కోసం 5000 పడకలను సిద్ధంగా ఉంచామని చెప్పారు. వ్యాక్సినేషన్‌లో తెలంగాణ ముందంజలో ఉందన్నారు. వాక్సినేషన్‎లో దేశ సగటు కంటే తెలంగాణ సగటు ఎక్కువగా ఉందని తెలిపారు. ఇక, తెలంగాణ ఆర్థిక మంత్రిగా కొనసాగుతున్న హరీశ్ రావు ఇటీవలే వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిగా అదనపు బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే.