రాంగ్ లీడర్ల చేతిలోకి పోతే రాష్ట్రం వెనక్కి పోతుందని హెచ్చరించారు మంత్రి హరీశ్ రావు. ఎంబీబీఎస్ కోసం పక్క దేశాలు, రాష్ట్రాలకు వెళ్లాల్సిన అవసరం లేదని.. తెలంగాణలో ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజీ వుందన్నారు. 

స్ట్రాంగ్ లీడర్ కావాలా.. రాంగ్ లీడర్ కావాలో ప్రజలు ఆలోచించుకోవాలని అన్నారు మంత్రి హరీశ్ రావు. శుక్రవారం ఓ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ.. రాంగ్ లీడర్ల చేతిలోకి పోతే రాష్ట్రం వెనక్కి పోతుందని హెచ్చరించారు. అధికారంలోకి రావడం కోసమే విపక్ష పార్టీలు పనిచేస్తున్నాయని.. ప్రస్తుతం రాష్ట్రంలో కర్ఫ్యూలు, అల్లర్లు లేవన్నారు. ఎంబీబీఎస్ కోసం పక్క దేశాలు, రాష్ట్రాలకు వెళ్లాల్సిన అవసరం లేదని.. తెలంగాణలో ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజీ వుందన్నారు. కేసీఆర్ సర్కార్ దేశానికి కొత్త దశ దిశ చూపించిందని మంత్రి పేర్కొన్నారు. హైదరాబాద్ హెల్త్ హబ్‌గా మారిందని.. ధాన్యం ఉత్పత్తిలో , డాక్టర్ల ఉత్పత్తిలో తెలంగాణ నెంబర్ 1 అని అన్నారు. తలసరి ఆదాయంలో, తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ నెంబర్ 1 అని అన్నారు. 

అంతకుముందు జనగాం జిల్లాలోని తన స్వస్థలమైన షోడశపల్లి గ్రామంలో జరిగిన బీఆర్‌ఎస్ పార్టీ సమావేశంలో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రసంగిస్తూ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అధికార పార్టీలో చేరకపోతే, కారణం లేకుండానే బీఆర్‌ఎస్ పార్టీని కుక్కల్లా మొరుగుతారని అన్నారు. వారిని మౌనంగా ఉంచేందుకే కేసీఆర్ బీఆర్‌ఎస్ పార్టీలోకి తీసుకొచ్చి వారిని పిల్లులుగా మార్చారని వ్యాఖ్యానించారు.

Also Read: కేసీఆర్ కాంగ్రెస్ కుక్కలను పిల్లులుగా మార్చారు : పల్లా రాజేశ్వర్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు...

ఎమ్మెల్సీ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో వైరల్ కావడంతో రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిపై జనగాం టికెట్‌ కోసం ఎమ్మెల్సీ పోటీ చేయడం గమనార్హం. మరో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి కూడా జనగాం రేసులో నిలిచారు. జనగాం నుంచి తనకే టికెట్ కావాలని పల్లా రాజేశ్వర్ రెడ్డి పట్టుబడుతున్నారు.

వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల జాబితాను చంద్రశేఖర్‌రావు విడుదల చేసినప్పటికీ, జనగాం నుంచి పార్టీ అభ్యర్థిని ఇంకా ప్రకటించలేదు. కాగా, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి తనకు కేసీఆర్‌తో, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌తో గత రెండు దశాబ్దాలుగా ఎలాంటి సంబంధాలున్నాయో చెబుతూ సోషల్ మీడియా వేదికగా ఆడియో క్లిప్‌ను విడుదల చేశారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలన్నింటినీ నెరవేరుస్తూ ఎమ్మెల్సీగా ప్రజలకు అందుబాటులో ఉంటున్నానని చెప్పారు.