రాహుల్ గాంధీకి కొత్త పేరు పెట్టిన హరీష్‌రావు

తెలంగాణ రాజకీయం రసవత్తరంగా మారుతోంది. అధికార బీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీల మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది. ఈ తరుణంలో కాంగ్రెస్ పై మంత్రి హ‌రీష్‌రావు సెటైర్లు వేశారు. 

Minister Harish Rao Fires Congress Fake Promises Telangana KRJ

Harish Rao:  ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ తెలంగాణ రాజకీయం మరింత రసవత్తరంగా మారుతోంది. మరోసారి అధికారం చేపట్టాలనే లక్ష్యంతో సాగుతున్న అధికార బీఆర్ఎస్, ఎలాగైనా సీఎం కేసీఆర్ ను గద్దేదించ అధికారంలోకి రావాలని వ్యూహా రచన చేస్తున్న ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీల మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది. ఏ చిన్న అవకాశం వచ్చినా.. ఏ చిన్న తప్పు దొర్లినా .. ఆ అంశాన్ని ప్రచార ఆస్త్రంగా మార్చుకుంటున్నారు. ఇలా నేతల మాటల తూటాలతొ ఎన్నికల వాతావరణం మరింత వేడెక్కుతోంది. ఈ తరుణంలో కాంగ్రెస్ పై మంత్రి హ‌రీష్‌రావును దుయ్య‌బ‌ట్టారు
 
తెలంగాణలో కర్ణాటక నేతల ప్రచారంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడ హామీలు చేయలేని ఇచ్చి, అధికారంలోకి వచ్చారని ఆరోపించారు.  తొలుత కర్ణాటక ప్రజలకు ఇచ్చినా  హామీలకు నేరవేర్చాలని అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. క‌ర్ణాట‌క‌లో ప్రకటించిన ఐదు హామీలనే అమలు చేయలేని  రాహుల్ గాంధీ..తెలంగాణ ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలను ఎలా నేరవేశారని నిల‌దీశారు. తెలంగాణ ప్రజలను మోసం చేయటానికి వస్తున్నారని అన్నారు. ప్ర‌జ‌ల్ని మోసం చేసిన రాహుల్ గాంధీ.. రాంగ్ గాంధీగా మారార‌ని విమ‌ర్శించారు. “వన్‌ ఛాన్స్‌ ప్లీజ్‌” అంటున్న కాంగ్రెస్‌ పార్టీకి ఓటేసి గెలిపిస్తే.. “ఎక్స్‌క్యూజ్‌మీ  ప్లీజ్‌” అంటుందని మంత్రి హరీష్‌ రావు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 

వంద అబద్దాలడైనా తెలంగాణ అధికారంలోకి రావాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తుందనీ, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. కరువు వస్తుంది, కర్ఫ్యూ వస్తుంది అని సెటైర్లు వేశారు. తెలంగాణ‌లో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక రైతు ఆత్మ‌హ్య‌త‌లు త‌గ్గాయ‌నీ,  కానీ, క‌ర్ణాట‌క‌లోని కాంగ్రెస్ పాలన హయంలో 357 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నార‌ని మంత్రి హ‌రీష్ విమర్శించారు. తెలంగాణలో కాంగ్రెస్ రంగు రంగుల ప్రపంచం చూపుతోంద‌ని, తెలంగాణ వెలుగుల దీపావళి లా చూడాలని అనుకుంటున్నారా..? దివాలా తీసిన కర్ణాటక కావాలో ప్ర‌జ‌లే తేల్చుకోవాల‌న్నారు. కర్ణాటక ఫెయిల్యూర్ కు మోడల్‌ అనీ, రాహుల్‌గాంధీకి ఓట‌ర్ల తగిన బుద్ధిచెబుతార‌ని హ‌రీష్ ఆశాభావం వ్య‌క్తం చేశారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios