ప్రధానమంత్రి  నరేంద్ర మోదీ వరంగల్‌లోని బీజేపీ సభలో చేసిన  కామెంట్స్‌కు తెలంగాణ మంత్రి హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. తెలంగాణకు పెట్టుబడులు వస్తున్నాయని మోదీనే అంటున్నారని.. మరి పెట్టుబడులు వస్తున్నాయంటే కేసీఆర్ గొప్పతనం కాదా? అని ప్రశ్నించారు. 

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వరంగల్‌లోని బీజేపీ సభలో చేసిన కామెంట్స్‌కు తెలంగాణ మంత్రి హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. ఎవరూ రాష్ట్రానికి వచ్చిన సీఎం కేసీఆర్‌ను తిడుతున్నారని అన్నారు. మొన్న రాహుల్ వచ్చిన, ఈ రోజు ప్రధాని మోదీ వచ్చినా వాళ్లకు తిట్టుడే పని విమర్శించారు. మోదీ ప్రభుత్వం తెలంగాణ పథకాలను కాపీ కొట్టిందని విమర్శించారు. తాము మంచిగా పని చేయకపోతే ఢిల్లీలో అవార్డులు ఎందుకు ఇస్తున్నారని ప్రశ్నించారు. ఢిల్లీలో అవార్డులు ఇస్తూ.. గల్లీలో తిడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణకు పెట్టుబడులు వస్తున్నాయని మోదీనే అంటున్నారని.. మరి పెట్టుబడులు వస్తున్నాయంటే కేసీఆర్ గొప్పతనం కాదా? అని ప్రశ్నించారు. 

తెలంగాణకు ప్రధాని మోదీ ఏం చేశారో చెప్పాలని అన్నారు. మోదీకి ఈడీ, సీబీఐలు అండగా ఉండొచ్చని.. తమకు తెలంగాణ ప్రజలు అండగా ఉంటారని అన్నారు. తెలంగాణకు నిధులు ఇచ్చినట్టుగా మోదీ చెబుతున్నారని.. అయితే అందులో నిజం లేదని.. రాష్ట్రానికి రావాల్సిన నిధులనే ఆపారని ఆరోపించారు. కేంద్రానికి నిజంగా తెలంగాణపై ప్రేమ ఉంటే నిజంగా తమకు రావాల్సిన డబ్బులు ఇవ్వాలని కోరారు. నీతి అయోగ్ చెప్పినా డబ్బులు ఇవ్వడం లేదని విమర్శించారు. 

బావుల కాడా మీటర్లు పెట్టాలేదనీ 21 వేల కోట్లు ఆపింది మీరు కాదా? అని ప్రశ్నించారు. తెలంగాణ అభివృద్ధిని మోదీ ప్రభుత్వం అడ్డుకుంటుందని ఆరోపించారు. తెలంగాణ అభివృద్ధి చెందుతుంటే కళ్ళలో మంటలు లేస్తున్నాయని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే తెలంగాణకు గిరిజన యూనివర్సిటీ ఇవ్వాలని అన్నారు. ప్రధాని మోదీది కపట ప్రేమ అని విమర్శించారు. కోచ్ ఫ్యాక్టరీ అడిగితే వ్యాగన్ యూనిట్ ఇచ్చారని అన్నారు. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ వచ్చి ఉంటే.. రూ. 20 వేల కోట్లు వచ్చి ఉండేవని.. కానీ ఇచ్చింది మాత్రం రూ. 500 కోట్లతో వ్యాగన్ ఫ్యాక్టరీ అని విమర్శించారు. కోచ్ ‌ఫ్యాక్టరీ ఇస్తామని పార్లమెంట్‌‌లో హక్కుగా చెబితే.. వ్యాగన్ ఫ్యాక్టరీ ఇచ్చి మోసం చేస్తున్నారని మండిపడ్డారు. లడ్డూ (రూ. 20000 కోట్ల కోచ్ ఫ్యాక్టరీ) ఇవ్వాల్సిన చోట ప్రధాని మోదీ పిప్పరమెంటు ఇచ్చారని విమర్శించారు. లడ్డూనేమో గుజరాత్‌కు తీసుకెళ్లారని.. తెలంగాణకేమో పిప్పరమెంటు ఇచ్చారని మండిపడ్డారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఇవ్వలేదని.. బురద జల్లుడు తప్ప బీజేపీ చేసేందేమి లేదని అన్నారు.