Asianet News TeluguAsianet News Telugu

ఈటల గెలిస్తే.. ఆయనకే లాభం, ఇక హుజురాబాద్‌లో అభివృద్ధి లేనట్లే: రాజేందర్‌కు హరీశ్ రావు కౌంటర్

హుజురాబాద్‌లో ఈటల రాజేందర్ గెలిస్తే ఈటలకే లాభమని వ్యాఖ్యానించారు మంత్రి హరీశ్ రావు. ఈటల గెలిస్తే అక్కడ అభివృద్ధి కుంటుపడుతుందని హరీశ్ రావు అన్నారు. వ్యక్తి ప్రయోజనమా, హుజురాబాద్ ప్రజల ప్రయోజనమా అన్న దానిపై చర్చ పెట్టాలని మంత్రి డిమాండ్ చేశారు.

minister harish rao counter to bjp leader etela rajender ksp
Author
Huzurabad, First Published Aug 8, 2021, 7:08 PM IST

మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్‌పై విమర్శలు గుప్పించారు  మంత్రి హరీశ్ రావు. హుజురాబాద్‌లో ఈటల రాజేందర్ గెలిస్తే ఈటలకే లాభమని వ్యాఖ్యానించారు. ఈటల గెలిస్తే అక్కడ అభివృద్ధి కుంటుపడుతుందని హరీశ్ రావు అన్నారు. వ్యక్తి ప్రయోజనమా, హుజురాబాద్ ప్రజల ప్రయోజనమా అన్న దానిపై చర్చ పెట్టాలని మంత్రి డిమాండ్ చేశారు. దళిత బంధు హుజురాబాద్‌లో వద్దని ఈటల అంటున్నారని హరీశ్ ధ్వజమెత్తారు. 

అంతకుముందు హూజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో తనపై పోటీ చేసి గెలవాలని సీఎం కేసీఆర్, మంత్రి  హరీష్‌రావులకు ఈటల రాజేందర్ సవాల్ విసిరారు. హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఆదివారం నాడు నిర్వహించిన ఎన్నికల సభలో ఆయన ఈ సవాల్ విసిరారు.నేనే  హుజూరాబాద్ ప్రజల గుండెల్లో ఉన్నానో లేదో రేపు ఎన్నికల్లో చూసుకుందామన్నారు. ఉరుములు, పిడుగులు పడ్డా తన గెలుపును ఆపలేరని ఆయన చెప్పారు. 

Also Read:దమ్ముంటే నాపై పోటీ చేసి గెలవాలి: కేసీఆర్, హరీష్‌లకు ఈటల సవాల్

తాను దిక్కులేనివాడిని కాదు, హుజూరాబాద్ ప్రజల హృదయాల్లో ఉన్న బిడ్డను అని ఆయన చెప్పారు. ఈ ఎన్నికల్లో తనను ఓడించేందుకు అవసరమైతే రూ. 5 వేల కోట్లను టీఆర్ఎస్ ఖర్చు చేసేందుకైనా వెనుకాడదని ఆయన ఆరోపించారు. మోకాలికి ఆపరేషన్ తర్వాత తొలిసారిగా ఆదివారం నాడు నిర్వహించిన సభలో ఆయన పాల్గొన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios