దమ్ముంటే నాపై పోటీ చేసి గెలవాలి: కేసీఆర్, హరీష్‌లకు ఈటల సవాల్
హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో తనపై పోటీ చేసి గెలవాలని సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావులకు మాజీ మంత్రి ఈటల రాజేందర్ సవాల్ విసిరారు.
హుజూరాబాద్: హూజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో తనపై పోటీ చేసి గెలవాలని సీఎం కేసీఆర్, మంత్రి హరీష్‌రావులకు మాజీ మంత్రి ఈటల రాజేందర్ సవాల్ విసిరారు.హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఆదివారం నాడు నిర్వహించిన ఎన్నికల సభలో ఆయన ఈ సవాల్ విసిరారు.నేనే హుజూరాబాద్ ప్రజల గుండెల్లో ఉన్నానో లేదో రేపు ఎన్నికల్లో చూసుకుందామన్నారు.ఉరుములు, పిడుగులు పడ్డా తన గెలుపును ఆపలేరని ఆయన చెప్పారు.
తాను దిక్కులేనివాడిని కాదు, హుజూరాబాద్ ప్రజల హృదయాల్లో ఉన్న బిడ్డను అని ఆయన చెప్పారు.ఈ ఎన్నికల్లో తనను ఓడించేందుకు అవసరమైతే రూ. 5 వేల కోట్లను టీఆర్ఎస్ ఖర్చు చేసేందుకైనా వెనుకాడదని ఆయన ఆరోపించారు.మోకాలికి ఆపరేషన్ తర్వాత తొలిసారిగా ఆదివారం నాడు నిర్వహించిన సభలో ఆయన పాల్గొన్నారు. ఈ అసెంబ్లీ స్థానం నుండి ఈటల రాజేందర్ టీఆర్ఎస్ అభ్యర్ధిగా 2009 నుండి విజయం సాధిస్తున్నారు. తొలిసారిగా ఆయన బీజేపీ అభ్యర్ధిగా ఈ ఉప ఎన్నికల్లో బరిలోకి దిగనున్నారు. ఉప ఎణ్నికల షెడ్యూల్ రాకముందే బీజేపీ, టీఆర్ఎస్ లు తమ ప్రచారాన్ని ప్రారంభించాయి.