ముస్లింలకు దుస్తులు పంచిన మంత్రి హరీష్, డిప్యూటీ స్పీకర్

minister harish rao cloths distribution to poor muslim people
Highlights

కేసిఆర్ పై ప్రశంసల వర్షం

మెదక్ : ముస్లింల సంక్షేమ కోసం ముఖ్య మంత్రి కేసీఆర్ అనేక కార్యక్రమాలు చేపట్టారని మంత్రి హరీష్ రావు చెప్పారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ముస్లింల మోహాలపై చిరునవ్వు కనిపిస్తోందన్నారు.షాదీ ముబారక్ పథకం ద్వారా పేద ముస్లిం యువతుల వివాహానికి ప్రభుత్వం లక్ష నూటా పదహార్ల ఆర్థిక సాయం అందిస్తుందన్నారు. దేశంలో ఏ సీఎం ఆలోచించని రీతిలో సీఎం కేసీఆర్ ఈ పథకాన్ని రూపకల్పన చేసారన్నారు. మెదక్ లో 2 కోట్లతో షాదీఖానా నిర్మిస్తున్నామని త్వరలోనే ఇది పూర్తవుతుందన్నారు. షాదీ ముబారక్, షాదీ ఖానా ద్వారా మెదక్ లోని పేద ముస్లింలు తమ ఆడపిల్లల పెళ్లిళ్లను తక్కువ ఖర్చుతో చేయవచ్చన్నారు.ఈద్గా, మసీదు మరమ్మతులకు రెండు కోట్లు ప్రభుత్వం అందిస్తుందన్నారు. అదే రీతిలో పేద మైనార్టీ విద్యార్థుల చదువు కోసం రాష్ట్రంలో 250 రెసిడెన్షియల్ పాఠశాల లను సీఎం ప్రారంభించారని చెప్పారు. మెదక్ లో ప్రస్తుతం ఉన్న మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ కాకుండా మరోకటి బాలికల కోసం మంజూరు చేస్తున్నట్లు మంత్రి హరీష్ రావు చెప్పారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు 1250 మంది పేద ముస్లింలకు దపస్తులు పంపిణీ చేశారు.

మెదక్ అభివృద్ధి కేసీఆర్ తోనే సాధ్యం.-హరీష్ రావు

మెదక్ జిల్లాను గత ప్రభుత్వాలు పట్టించుకోలేదని మంత్రి హరీష్ రావు విమర్శించారు. మెదక్ జిల్లా అయినప్పటికీ సంగారెడ్డి కేంద్రంగా ఉండేదన్నారు.‌ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ ‌మెదక్ ను జిల్లా కేంద్రంగా తీర్చిదిద్దారని చెప్పారు.  మెదక్ పట్టణానికి ఫుట్ పాత్, నాలుగు వరుసల రోడ్, బటర్ ఫ్లై లైట్లతో ‌సుందరంగా తీర్చిదిద్దుతామన్నారు.  తాగు నీటి సమస్య ను పరిష్కరిస్తామన్నారు. మెదక్ ఖిల్లాను , చేగుంట రోడ్ ను అభివృద్ధి చేసామన్నారు. పిట్లం‌చెరువు, గోసముద్రం మినీ ట్యాంక్ బండ్ ను అభివృద్ధి ‌చేస్తామన్నారు.

సమావేశంలో ఉపసభాపతి పద్మా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ ముస్లింలందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. మెదక్ పట్టణం లో 1250 మంది పేద ముస్లింలకు దుస్తులు పంపిణీ చేస్తున్నామన్నారు. ముస్లిం లతో పాటు క్రైస్తవుల పండుగ క్రిస్మస్ ను సీఎం కేసీఆర్ ఘనంగా నిర్వహిస్తున్నారని చెప్పారు. మెదక్ లో 260 మంది పేద ముస్లింలకు  కోటి 30 లక్షల రూపాయల ను ప్రభుత్వం షాదీ ముబారక్ ద్వారా ఆర్థిక సాయం చేసిందన్నారు.

loader