Asianet News TeluguAsianet News Telugu

జువ్వాడికి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు: మంత్రి గంగుల నివాళులు

: మాజీ మంత్రి జువ్వాడి రత్నాకర్ రావు మృతికి మంత్రి గంగుల కమలాకర్ ఆదివారం నాడు నివాళులర్పించారు. రత్నాకర్ రావు కుటుంబసభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు. రత్నాకర్ రావు అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహిస్తామని  మంత్రి ప్రకటించారు.
 

minister gangula kamalakar pays tributes to former minister juvvadi ratnakar rao
Author
Karimnagar, First Published May 10, 2020, 1:17 PM IST

కరీంనగర్: మాజీ మంత్రి జువ్వాడి రత్నాకర్ రావు మృతికి మంత్రి గంగుల కమలాకర్ ఆదివారం నాడు నివాళులర్పించారు. రత్నాకర్ రావు కుటుంబసభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు. రత్నాకర్ రావు అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహిస్తామని  మంత్రి ప్రకటించారు.

minister gangula kamalakar pays tributes to former minister juvvadi ratnakar rao

జువ్వాడి  రత్నాకర్ రావు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కరీంనగర్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో ఆదివారం తెల్లవారుజామున మరణించారు. మూడు సార్లు బుగ్గారం ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేశారు. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం తిమ్మాపూర్‌లో అంత్యక్రియలు నిర్వహించనున్నారు..

also read:మాజీ మంత్రి జువ్వాడి రత్నాకర్ రావు కన్నుమూత

తిమ్మాపూర్‌ సర్పంచిగా రత్నాకర్‌ తన రాజయకీయ ప్రస్థానం ప్రారంభించారు. 1982లో జగిత్యాల పంచాయతి సమితి అధ్యక్షుడిగా పనిచేశారు. 1982లో జరిగిన ఎన్నికల్లో జగిత్యాల ఎమ్మెల్యే స్థానానికి కాంగ్రెస్‌ టికెట్‌పై పోటీ చేసి ఓడిపోయారు. 1989లో పార్టీ టికెట్‌ నిరాకరించడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి బుగ్గారం నుంచి తొలిసారి గెలుపొందారు. 1994లో ఆయన ఓటమిపాలయ్యాడు. 1999, 2004లో బుగ్గారం ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2009, 2010లో కోరుట్ల నుంచి పోటీచేసి ఓడిపోయారు. అప్పటి నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios