సీఎం కేసీఆర్ చెప్పే మాట తమకు వేదవాక్కని...ముఖ్యమంత్రి మార్పు లేదని కేసీఆర్ స్వయంగా ప్రకటించారు కాబట్టి దానిపై ఎలాంటి వ్యాఖ్యలు చేయబోమన్నారు మంత్రి గంగుల కమలాకర్. 

కరీంనగర్: దేశానికి మహాత్ముడు ఎలాగో తెలంగాణ కేసీఆర్ అలాగని మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. కేసీఆర్ ఉన్నన్ని రోజులు ఏ పార్టీకి పుట్టగతులు ఉండవని హెచ్చరించారు. టీఆర్ఎస్ పార్టీలో ధిక్కార స్వరం అనేది లేదని ..కేసీఆర్ చెప్పే మాట తమకు వేదవాక్కని గంగుల స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి మార్పు లేదని కేసీఆర్ స్వయంగా ప్రకటించారు కాబట్టి దానిపై ఎలాంటి వ్యాఖ్యలు చేయబోమన్నారు. 

''టీఆర్ఎస్ ప్రభుత్వం రాక ముందు బీసీలను బానిసలు గా భావించారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే బీసీలు ఆత్మ గౌరవంతో జీవిస్తున్నారు. కోట్ల రూపాయలు విలువ చేసే కోకాపేటలో ఆత్మగౌరవం భవన నిర్మాణం ప్రారంభమయ్యింది. మిగతా ఆన్ని చోట్ల మార్చి నెలలో ఆత్మగౌరవ భవనాల నిర్మాణం ప్రారంభమౌతాయి'' అని హామీ ఇచ్చారు. 

read more ఒక్కోసారి ఒక్కొక్కరికి బాణం: షర్మిలపై సీతక్క ఆసక్తికరం

''బీజేపీ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే... ఆ పార్టీ ఎంపీలు బండి సంజయ్ ,అరవింద్ కలిసి వస్తే బీసీ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని ప్రధాని మోదీని అడుగుదాం. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నాయకులు చట్టసభలో రిజర్వేషన్ కల్పించేందుకు కృషి చేయాలి ఎంబీసీలు అంటే మీకు తెలుసా..? 17 కులాల వారిని బీసీల్లో చేర్చిన ఘనత ముఖ్య మంత్రి కేసీఆర్ దే'' అని గంగుల పేర్కొన్నారు. 

''బీసీ స్కాలర్ షిప్స్ కోసం మీరు 500కోట్ల రూపాయలు ఇస్తే 9000 కోట్లు కేటాయించిన ఘనత తెరాస ప్రభుత్వానిది. బీసీ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే చట్టసభల్లో రిజర్వేషన్ కల్పించాలి. కళాశాలలు, పాఠశాలల్లో ఫీజులు కేవలం ఈ నాలుగు నెలలకే ఫీజులు వసూలు చేసేలా చర్యలు తీసుకున్నాం'' అని గంగుల అన్నారు.