నాయకులు కాదు... పార్టీకి క్యాడరే వెన్నెముక: ఈటల కీలక వ్యాఖ్యలు

 హుజురాబాద్ నియోజకవర్గ స్థాయి టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశానికి హాజరైన రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల కీలక వ్యాఖ్యలు చేశారు. 
 

minister etela rajender interesting comments

జమ్మికుంట: ఏ పార్టీకయిన క్యాడరే వెన్నుముక అని... కార్యకర్తలు లేని పార్టీ జీవచ్ఛవం లాంటిదని మాజీ మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. హుజురాబాద్ నియోజకవర్గ స్థాయి టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశానికి హాజరైన రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల కీలక వ్యాఖ్యలు చేశారు. 

''గ్రామాలలో టిఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి గొప్పగా కృషి చేయాలి. మీతోపాటు నేనూ ఉంటా. క్రియాశీలక సభ్యత్వం చేసిన వారందరికీ ప్రత్యేక గుర్తింపు కార్డులు ఇస్తాం. పార్టీ సభ్యత్వం కలిగిన వ్యక్తికి తెలంగాణలో ఎక్కడైనా ఏ నాయకుడైనా అండగా ఉంటాడు. హుజూరాబాద్ నియోజకవర్గం లో లక్ష సభ్యత్వానికి కృషి చేయాలి'' అని సూచించారు.

''నియోజకవర్గ పరిధిలో 3900 ఇండ్లు మంజూరు చేశాను. గుడిసెలు లేని నియోజకవర్గంగా హుజురాబాద్ ను చూడాలని ఉంది.  20 ఎన్నికలను చూశాను ఏ పార్టీ అయితే కార్యకర్తల బలం ఉంటుందో అదే పార్టీ విజయం సాధిస్తుంది. పార్టీ పటిష్టంగా ఉంటే డబ్బులు మద్యం వస్తువులు పరిస్థితి రాదు. ధర్మం న్యాయం తో పనిచేసే నిజమైన కార్యకర్తలకు పదవులు రావాలంటే పార్టీ పటిష్టంగా ఉండాలి'' అని ఈటల అన్నారు. 

read more   కేటీఆర్ ను కాదు ఈటలను సీఎం చేయాలి: ఎమ్మెల్సీ అభ్యర్థి చెరుకు సుధాకర్

మరోవైపు టీఆర్ఎస్ పార్టీ ఈటలను సీఎం చేయాలన్న డిమాండ్ పెరుగుతోంది. ''ఈటల ఏం తక్కువ చేశారు? కేటీఆర్‌ ఏం ఎక్కువ చేశారు? సీఎం కుమారుడే సీఎం కావాలా? దళితుడిని సీఎం చేస్తే ఏమవుతుంది? అసలు తెలంగాణ ఉద్యమంలో కేటీఆర్‌ పాత్ర ఏంటి?'' అని బిజెపి రా రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌ ప్రశ్నించారు.

మంత్రి కేటీఆర్‌ను ముఖ్యమంత్రిని చేస్తే టీఆర్‌ఎస్ లో అణుబాంబు కంటే భారీ పేలుడు జరగడం ఖాయమని సంజయ్‌ అన్నారు. కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి పనిచేసిన వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ను ఎందుకు సీఎం చేయకూడదని ప్రశ్నించారు. 

తన తనయుడు కేటీఆర్‌ను సీఎంను చేయడానికి కేసీఆర్‌ మూడు రోజులపాటు దోష నివారణ పూజలు చేశారని, ఆ ద్రవ్యాలను త్రివేణి సంగమంలో కలిపేందుకే కాళేశ్వరం వెళ్లారని అన్నారు. అంతే తప్ప.. ప్రాజెక్టు కోసం కాదని పేర్కొన్నారు. ఫాంహౌస్ లో ఈ పూజలు మూడురోజులు జరిగాయని, శృంగేరి నుంచి ప్రత్యేకంగా పూజారులను రప్పించారని తెలిపారు. ఇక సీతారామ ప్రాజెక్టు, తుపాకులగూడెం ప్రాజెక్టుల పేరిట మరో రూ.50 వేల కోట్లు దండుకునేందుకు కొత్త నాటకానికి తెర తీశారని సంజయ్‌ ఆరోపించారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios