బీజేపీతో గొడవపడే ఉద్ధేశ్యం లేదు.. రైతుల కోసమే కేంద్రంపై పోరాటం: ఎర్రబెల్లి
బీజేపీతో గొడవ పెట్టుకోవాలనే ఆలోచన తమకు లేదన్నారు టీఆర్ఎస్ నేత, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Errabelli dayakar rao) . అయితే రైతులకు అన్యాయం చేసేలా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతరేకంగా మాత్రం పోరాడతామని ఆయన తేల్చిచెప్పారు.
బీజేపీతో గొడవ పెట్టుకోవాలనే ఆలోచన తమకు లేదన్నారు టీఆర్ఎస్ నేత, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Errabelli dayakar rao) . అయితే రైతులకు అన్యాయం చేసేలా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతరేకంగా మాత్రం పోరాడతామని ఆయన తేల్చిచెప్పారు. ధాన్యం కొనుగోలు చేస్తామని చెప్పేంత వరకు కేంద్ర ప్రభుత్వంపై తమ పోరాటం కొనసాగుతూనే ఉంటుందని ఎర్రబెల్లి స్పష్టం చేశారు. ఇక వరంగల్‌లో నిర్వహించే విజయగర్జన సభకు 12 లక్షల మంది హాజరవుతారని మంత్రి తెలిపారు. సభకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయని .. పార్కింగ్ కోసం 1500 ఎకరాల్లో ఏర్పాట్లు చేశామని దయాకర్ రావు చెప్పారు. సభాప్రాంగణం వద్ద మరో 100 ఎకరాలను సేకరిస్తున్నామని... సభ కోసం స్థలాలను ఇచ్చిన దేవన్నపేట, కోమటిపల్లి రైతులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు (kcr) వరంగల్‌కు (warangal) రానున్నారని ఎర్రబెల్లి తెలిపారు. హనుమకొండలోని జిల్లా కార్యాలయాన్ని సీఎం ప్రారంభిస్తారని చెప్పారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారని మంత్రి తెలిపారు. పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్ తగ్గించాలని డిమాండ్ చేస్తూ చేపడుతున్న మహా ధర్నాను అన్ని నియోజకవర్గ కేంద్రాలలో విజయవంతం చేయాలని ఎర్రబెల్లి దయాకర్ రావు కోరారు.
టీఆర్ఎస్ vijaya garjana sabha సభకు తమ భూములను ఇవ్వబోమని రైతులు తేల్చి చెప్పడంతో కొద్దిరోజుల క్రితం దేవన్నపేటలో ఉద్రిక్తత చోటు చేసుకొంది. టీఆర్ఎస్ శ్రేణులు, రైతులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఒకానొకదశలో రైతులు, టీఆర్ఎస్ శ్రేణుల మధ్య తోపులాట చోటు చేసుకొని ఉద్రిక్తత నెలకొంది. హన్మకొండ జిల్లాలోని హసన్‌పర్తి మండలం Devannapeta గ్రామంలో విజయగర్జన సభ కోసం స్థలాన్ని పరిశీలించేందుకు మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్, ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ లు గత బుధవారం నాడు వచ్చారు.
Also Read:టీఆర్ఎస్ విజయగర్జన సభకు భూములివ్వం: దేవన్నపేటలో ఉద్రిక్తత
దేవన్నపేట గ్రామ శివారులోని ఖాళీ స్థలంతో పాటు పంటపొలాలను Trs నేతలు పరిశీలించారు. అయితే టీఆర్ఎస్ సభ కోసం పంట పండే తమ భూములను ఇచ్చేది లేదని రైతలు టీఆర్ఎస్ నేతలకు చెప్పారు. ఈ క్రమంలో టీఆర్ఎస్ నేతలు, రైతుల మధ్య వాగ్వాదం చోటు చేసుకొంది.ఈ క్రమంలో స్థానిక బీజేపీ నేతలు కూడా రైతులకు మద్దతుగా నిలిచారు. ఈ క్రమంలో రైతులు, టీఆర్ఎస్, Bjp నేతల మధ్య వాగ్వాదం తీవ్రమైంది. వీరి మధ్య తోపులాట చోటు చేసుకొంది. అక్కడే ఉన్న పోలీసులు ఇరువర్గాలను అడ్డుకొన్నారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది.
తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడేళ్ల కాలంలో ప్రజల కోసం తీసుకొచ్చిన పథకాలు,, కార్యక్రమాలను ప్రజలకు వివరించేందుకు విజయగర్జన సభను గులాబీ దళం నిర్వహిస్తోంది. ఈ నెల 15వ తేదీనే ఈ సభను నిర్వహించాలని తొలుత నిర్ణయం తీసుకొన్నారు. దీక్షా దివస్ రోజున ఈ సభను నిర్వహించాలని పార్టీ నేతలు చేసిన సూచన మేరకు ఈ సభను ఈ నెల 29వ తేదీకి వాయిదా వేశారు.ఈ సభకు రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది కార్యకర్తలు తరలిరావాలని టీఆర్ఎస్ కోరింది.